సాయం చేయమంటే వాట్సాప్ లో బండ బూతులు తిట్టిన ఐజీ.. | Bastar Top Cop threat activists in Whats app.

Bastar top cop alleged messages to activists

Bastar Kalluri, Shiv Ram Prasad Kalluri, IG Kalluri Activists, Kalluri Bela Bhatia, Bela Bhatia threat, IG Kalluri Whats-app Messages, Maoists IG Kalluri, Bastar IG Kalluri

Bastar range Inspector General of Police Shiv Ram Prasad Kalluri again in News. Threat to activist Bela Bhatia who took up case of rape victims. Later asking about this Some Activists threat by same and alleged messages by Bastar Top Cop. 'Dogs Like You Will Be Stoned.

కుక్కలను తరిమి కొట్టినట్లు కొడతా!

Posted: 01/25/2017 09:33 AM IST
Bastar top cop alleged messages to activists

మావోయిస్టుల అణచివేత ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న బస్తర్‌ ఐజీ కల్లూరి పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇందుకు కారణం ఆయన ఫోన్ నుంచి అసభ్య పదజాలంతో కూడిన సందేశాలు వెలువెత్తటమే.

తీవ్ర పదజాలంతో కూడిన ఆయా సందేశాలను మీడియా బయటపెట్టడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బేలా బాటియా అనే మహిళ, భద్రతా దళాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఉద్యమిస్తున్న ఓ సామాజిక కార్యకర్త. ఈ నేపథ్యంలో సోమవారం ఓ వర్గం ఆమెను ఇంటి వద్ద ఉండగానే చంపుతామంటూ బెదిరింపులకు గురిచేసింది. తక్షణమే బస్తర్ వీడి వెళ్లాలంటూ ఆమెపై దాడికి పాల్పడింది. దీనిపై పలువురు బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. దీని వెనుక కల్లూరి ఉన్నాడంటూ వారు ఆరోపిస్తున్నారు కూడా.

అంతేకాదు ఇందుక సంబంధించి ఆయన మొబైల్ కు వారు కొన్ని సందేశాలు కూడా పంపుతున్నారు. డబ్బుకు లొంగిపోయి ఇలా వృత్తికి ద్రోహం చేయటం సరికాదంటూ వారు అందులో పేర్కొన్నారు. దానికి అటు నుంచి కూడా ఘాటుగానే రిప్లైలు వచ్చాయి కూడా. సందీప్ సింగ్ అనే ఓ కార్యకర్త పంపిన సందేశానికి బదులుగా కల్లూరి నుంచి ‘‘ మావోలను మరియు వాళ్ల తొత్తులుగా పనిచేస్తున్న వాళ్లను బస్తర్ నుంచి కుక్కలను తరిమి కొట్టినట్లు కొడతా. జాగ్రత్త! అంటూ అందులో ఉంది.

Kalluri Warning Messages

దయ చేసి బేలా భాటియా భద్రత విషయంలో కల్పించుకోవాలంటూ మరో సందేశానికి బూతు సమాధానం ఇవ్వటం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఆరాతీసేందుకు యత్నించిన మీడియాకు చిక్కకుండా తిరిగిన కల్లూరి ఎట్టకేలకు స్పందించాడు. అదంతా అబద్ధమని, దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bastar  IG Kalluri  Whats-app Messages  Threat  

Other Articles

Today on Telugu Wishesh