అనంత గుంతకల్లులోనూ.. కాసుల వర్షం.. ananthapuram sbi atm rains cash

Ananthapuram sbi atm rains cash

Demonetisation, Currency ban, ATM, ATM malfunction, atm technical problem, SBI ATM, more cash, ananthapuram police, crime news

The whir of the ATM machine sounded very reassuring for a customer in guntakal of ananthapur district, who got more amount of cash than he asked for.

అనంత గుంతకల్లులోనూ.. కాసుల వర్షం..

Posted: 01/24/2017 12:56 PM IST
Ananthapuram sbi atm rains cash

దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని పారద్రోలేందుకు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నోట్ల కోసం అనేక కష్టాలు పడుతున్న ప్రజలకు నోట్ల కష్టాలు తీరిన క్రమంలో మాత్రం కొందరికి అదృష్టాన్ని కల్పిస్తున్నాయి ఏటీయం కేంద్రాలు. ఇటీవల రాజస్థాన్‌, అసోంలలో కాసుల వర్షం కురిపించిన ఏటీయం కేంద్రాలు.. అక్కడి ప్రజలకు అడిగిన దానికంటే అధిక మొత్తంలో డబ్బులను విధిల్చి.. కాసింత సేపు వారిని ఉక్కిబిక్కిరి చేసింది. తాజాగా మనవాళ్లను కూడా అదే స్థాయిలో పలుకరించింది భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీయం. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

గుంతకల్లు పట్టణంలో సోమవారం రాత్రి ఎస్‌బీఐ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఖాతాదారులు రూ.3 వేలు విత్‌ డ్రా చేస్తే రూ.6వేలు, అంతకు మించి కూడా డబ్బులు వచ్చాయి. దీంతో ఖాతాదారులు ఆనందంగా వచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఓ ఖాతాదారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు బ్యాంకు అధికారులకు తెలిపారు. అధికారులు ఏటీఎంను పరిశీలించి మూసివేశారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఏ ఖాతాదారుడు ఎంత తీసుకున్నారనేది సర్వర్‌లో నమోదవుతుందని, ఆ వివరాలు సేకరించి వారు తీసుకున్న డబ్బును తిరిగి తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh