మొన్న ముంబై హైకోర్టు.. ఇవాళ ఢిల్లీ హైకోర్టు.. అదే తీర్పు sex before marriage cannot be treated as rape case

Sex before marriage cannot be treated as rape case

rape, Delhi High Court (HC), Crime Against Women (CAW), Law, false cases, NGO, Chargesheet, Justice Mridula Bhatkar, Bhatkar, rape case, anticipatory bail, sex before marriage, educated girls, woman judge, bombay high court, crime news,

Delhi High Court’s order is a lesson to those judges who refuse to regard rape complainants with suspicion merely because the latter went back on their words.

మొన్న ముంబై హైకోర్టు.. ఇవాళ ఢిల్లీ హైకోర్టు.. అదే తీర్పు

Posted: 01/24/2017 12:08 PM IST
Sex before marriage cannot be treated as rape case

అత్యాచారాలు వేరు.. ప్రియుడు చేతిలో మోసపోవడం వేరూ అంటూ బాంబే హైకోర్టు ఈ నెల 21న వెలువరించిన సంచలన తీర్పు తరువాత అదే వ్యాఖ్యలను చేసిన ఢిల్లీ హైకోర్టు.. అత్యాచారం కేసులో బాధితురాలు మాట మార్చడానికి కారణాలు ఏంటన్నది.. ఇలాంటి కేసులలో ఎలా వ్యవహరించాలన్నది.. ఎలా తీర్పులను ఇవ్వాలన్న విషయంలో మార్గదర్శకంగా నిలిచేలా తీర్పును వెలువరించింది.

గతంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి అత్యాచారం చేసిన యువకుడిపై ఆ కేసును కొట్టివేయాలని దాఖలైన క్వాష్ పిటీషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం.. బాధితురాలిపై ఒత్తిడి మేరకే ఈ క్వాష్ పిటీషన్ దాఖలై వుంటుందని అభిప్రాయపడింది. బాధితురాలి తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు.. ప్రస్తుతం చేస్తున్న పిల్లిమొగ్గ వ్యాఖ్యలకు తేడా వుందని.. అయితే అమె ఇలాంటి పిటీషన్ ను దాఖలు చేయడం వెనుక నిందితులకు సంబంధించి వారి ప్రభావం, వారి నుంచి ఒత్తితి వుండటం కూడా కారణం కావచ్చని అభిప్రాయపడింది.

ఈ మధ్య అత్యాచారం కింద పలువురు యువతులు కేసులు నమోదు చేయడం ఫ్యాషన్ గా మారిందని, అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ప్రియుడు మోసం చేసిన కేసులో అత్యాచారం కేసులను వెనక్కి తీసుకున్నా పర్వాలేదని, ఎందుకంటే అవి అత్యాచారం కింద పరిగణించలేమని చెప్పిన ఢి్ల్లీ హైకోర్టు.. అత్యాచారాలు జరిపిన తరువాత బాధితులపై ఒత్తడి తీసుకువచ్చి.. లేక రాజీ కుదర్చుకోవడంతో అత్యాచార కేసులను వెనక్కు తీసుకునే కేసులలో మాత్రం అంగీకరించలేమని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  Delhi High Court (HC)  Crime Against Women (CAW)  Law  false cases  NGO  Chargesheet  

Other Articles