జన సేన ‘దేశ్ బచావో’ వచ్చేసింది | DeshBachao Pawan Kalyan's Musical Protest out.

Pawan kalyan s musical protest album desh bachao poster released

DeshBachao, Janasena Music Album, AP Special Status Janasena Song, Desh Bachao Album, Pawan kalyan Desh Bachao poster, Desh Bachao Song, Musical Protest Album Desh Bachao, Pawan Kalyan Desh Bachao

Janasena chief Pawan Kalyan's Musical Protest Album Desh Bachao Released.

జనసేన దేశ్ బచావో పోస్టర్ వచ్చేసింది

Posted: 01/24/2017 09:58 AM IST
Pawan kalyan s musical protest album desh bachao poster released

ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కేంద్రం నిలబెట్టుకోలేకపోతే, తిరగబడాలంటూ ఆంధ్రా యువతకు పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేశాడు. 'దేశ్ బచావో' పేరిట ఓ మ్యూజికల్ ఆల్బమ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు కాసేపటి క్రితం ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

 

వాస్తవానికి ఈ పోస్టర్ ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే, అంటే ఈ రోజు ఆయన పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంగళవారం ఉధయం మరోసారి ట్విట్టర్ లో ఆయన పోస్టులు చేశాడు. భవిష్యత్తు తరాల కోసం లెక్కలేనని బలిదానాలు జరిగినప్పుడు వారి త్యాగాలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనది అంటూ ట్వీట్ చేసిన పవన్. నీస్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్ల లేకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకలేకపోతే, నీవు బానిసగానే ఉండిపోవటానికే నిర్ణయించుకుంటే ఎంత ద్రోహివిగా మారావు ఆ పవిత్ర రక్తానికి.. అంటూ ఓ ఫోటోను ఉంచాడు.

ఇక చట్టాలను తయారు చేసే వాళ్ల కోసం అంటూ... మేము పూల గుత్తులు వ్రేలాడే వసంత రుతువులం కాదు వట్టి మనుష్యులం! దేశం మాకు గాయాలిచ్చినా నీకు మేము పువ్వులిస్తున్నాం. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా యోచించు ఏమి తెస్తావో మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు అంటూ శీశీంద్ర అనే వ్యక్తి రాసిన కొటేషన్లను పోస్ట్ చేశాడు.

జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో నిరసన కార్యక్రమానికి యువత కదలి రావాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన నిరసనను దేశ్ బచావో ద్వారా తెలియజేస్తామన్న ఆయన... ఉద్యమ నినాదాన్ని ఆ ఆల్బం ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని తెలిపాడు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ఆల్బం ద్వారా జనసేన తన గొంతుకను వినిపించేందుకు సిద్ధమైపోతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Desh Bachao  Musical Protest Album  

Other Articles

Today on Telugu Wishesh