యువతిపై అటోవాలా అరాచకం.. Autowala Anarchy on Woman in attapur

Shockingg auto driver anarchy on woman in hyderabad

Shocking Accident, shocking incident, Auto Driver, Auto Driver Anarchy on Woman, Auto Hits Woman, Driver Anarchy on Woman, woman, attapur, anarchy, hyderabad, crime, shocking incident

Hyderabad Auto driver hits a young woman in attapur and pushes her on to driver-less auto which dragged the victim for about 300 meters

ITEMVIDEOS: షాకింగ్: యువతిపై అటోవాలా అరాచకం.. నిలదీసినందుకు శిక్ష..

Posted: 01/24/2017 10:57 AM IST
Shockingg auto driver anarchy on woman in hyderabad

హైదరాబాద్ అత్తాపూర్ లో అటోడ్రైవర్ ఓ యువతి పట్ల దారుణంగా వ్యవహరించాడు. తన మనవరాలు వయస్సున్న ఓ యువతి పట్ల.. మానవత్వం మరచిన మృగంలా వ్యవహరించాడు.. తప్పు చేయడమే కాకుండా.. అలా ఎందుకు చేశావని నిలదీయడమే తప్పు అన్నట్లు.. యువతిని నడిరోడ్డుపై శిక్షించాడు. అందరూ చూస్తుండగా, సహచర పాదచారులు అతడితో వాగ్వాదానికి దిగుతున్నా అవన్నీ పట్టించుకోని ఓ మనస్సులేని కర్కషుడు జనం సాక్షిగా యువతిని ఈడ్చుకుంటూ వెళ్లి అటోపై పడేశాడు. అటోపై వేగంగా వెళ్లి పడటంతో డ్రైవర్ లేని అటో యువతిని పావు కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లి అగింది.

వివరాల్లోకి వెళ్తే..  ఇవాళ ఉదయం.. తొమ్మిది గంటల అందరూ కార్యాలయాలకు, కాలేజీలకు వెళ్లే క్రమంలో.. బిజీబిజీగా వున్న రోడ్డుపై ఓ ఆరు పదలు వయస్సున్న అటో డ్రైవర్ తన నెంబరు లేని అటోతో రోడ్డుపైకి వచ్చాడు. వయస్సు చూస్తే మర్యాద ఇవ్వాలనిపించేలా వున్నా.. అతని చర్యలే దారుణంగా వున్నాయి. బిజీగా వెళ్తూన్న అతను ఓ యువతిని ఢీకోన్నాడు. అంతటితో అగకుండా యువతిని తిట్టాడు. సారీ అని చెబితే పోయేదానికి.. అటో కనబడటం లేదా..? అంటూ కళ్లు మూసుకుని రోడ్డుపైకి వస్తారా..? అంటూ తిట్టాడు.

అటోతో తనను ఢికొన్నంది చాలక ఇక పైగా తిటతావేంటని యువతి కోపగించుకుంది. అంతటితో యువతి చుట్టుపక్కల వున్నవారు కూడా అమెకు మద్దతుగా అటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. అంతే ఎక్కడలేని చిర్రెత్తుకోచ్చిన అటోడ్రైవర్.. యువతిని జనం మధ్య నుంచి ఈడ్చుకోచ్చి.. అటోపై పడేశాడు. అంతే అటోపై ఒక్కసారిగా యువతి పడేసరికి.. అప్పటి వరకు న్యూట్రల్ వో వున్న అటో కాస్తా.. ఒక్కసారిగా గేర్ లోకి పడిపోయి.. యువతిని సుమారుగా పావు కిలో మీటర్ దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో స్థానికులు పరుగు పరుగున వెళ్లి యువతని రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా..? లేదా అన్నది తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : auto driver  woman  attapur  anarchy  hyderabad  crime  shocking incident  

Other Articles