జల్లికట్టు సుప్రీం తీర్పు వారం వాయిదా | Centre requested Supreme Court on Jallikattu verdict.

Supreme court delays jallikattu verdict by a week

Supreme Court, Jallikattu Protest, Supreme Court Jallikattu decision, Supreme Court Delay, Jallikattu Verdict, Jallikattu final verdict, Pannerselvam Jallikattu Verdict, Pannerselvam Jallikattu ordinance, PETA Jallikattu Supreme Court

Supreme Court Delays Verdict By A Week, As Asked By Centre. Chief Minister O Pannerselvam said on Friday morning that Jallikattu, the ancient bull-taming festival, will return to Tamil Nadu in a couple of days through an ordinance or executive order that he has sent for the President's approval. He has urged the thousands of people gathered at Chennai's Marina Beach for four days now, to end their protest.

జల్లికట్టుపై సుప్రీం తీర్పు.. ఏం జరుగుతోంది?

Posted: 01/20/2017 11:19 AM IST
Supreme court delays jallikattu verdict by a week

జల్లికట్టుపై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా పడింది. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీర్పు వెలువరిస్తే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి విజ్నప్తి చేసింది. దీంతో వారంపాటు తీర్పు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.

కాగా, జల్లికట్లు కోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పేర్కొన్నాడు. దయచేసి ఆందోళనలు వీడాలని ఆయన ప్రజలను కోరాడు. ఆర్డినెన్స్ ను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందజేశామని, రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం కోసం యత్నిస్తున్నట్లు కూడా ఆయన వివరించాడు.

తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా నిరసనకారులు మెరీనా బీచ్ లోనే ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా వారు అక్కడ నుంచి కదలడం లేదు. జల్లికట్టు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు తాము ఆర్డినెన్స్ ఇవ్వలేమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్త బంద్ కు కూడా నిరసనకారులు పిలుపునివ్వటం తెలిసిందే.

రెండు రోజుల్లో పరిష్కారం...

జల్లికట్టు సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్‌ దవే అన్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు పలు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని అన్నారు.

తమిళనాడులో అధికార పార్టీ అన్నా డీఎంకే ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్తో శుక్రవారం సమావేశమయ్యారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ను జారీ చేయాలని కోరారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడులో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులు వీరికి మద్దతు తెలియజేశారు.

జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు చెబుతున్నాయి. అయితే ఎద్దులతో తాము ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటామని, అందువల్ల జల్లికట్టును తమిళ సంస్కృతిలో భాగంగానే చూడాలని అంటున్నాడు నటుడు విక్రమ్ ప్రభు. ఇందుకు సంబంధించిన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ చిన్నారి వీడియో నెట్ లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Supreme Court  Verdict  Delay  

Other Articles

Today on Telugu Wishesh