సైకిల్ రేసులో కొడుకుదే విజయం.. పెద్దాయన ఏం చేస్తాడో? | Akhilesh pedals out of Mulayam Singh Yadav's shadow.

Akhilesh yadav gets samajwadi party cycle symbol

Samajwadi Party, Cycle symbol, Akhilesh Yadav won, Mulayam Singh Yadav, Akhilesh Yadav Samajwadi National Party, UP elections, Uttar Pradesh Politics, Election Commission supports Akilesh Yadav, Akilesh Yadav Congress, Congress UP elections, BJP UP elections, Samajwadi feud, Cycle Symbol

Akhilesh Yadav Wins Cycle. Coming Soon, Grand Alliance With Congress. Father Mulayam Singh loses battle of symbol. Akhilesh Yadav Group Is Samajwadi Party.

నేతాజీకి డబుల్ షాక్ : సైకిల్ ఇక చిన్నోడిదే...

Posted: 01/17/2017 09:00 AM IST
Akhilesh yadav gets samajwadi party cycle symbol

సమాజ్‌వాదీ పార్టీలో త‌లెత్తిన సంక్షోభం త‌రువాత పార్టీ పెద్దాయన, ‘నేతాజీ’ ములాయం సింగ్ యాద‌వ్‌కి షాక్ ల మీద షాకులు త‌గులుతున్నాయి. పార్టీ గుర్త‌యిన సైకిల్ అఖిలేష్ వ‌ర్గానికే చెందుతుంద‌ని సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వెంటనే మరో షాకిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్‌ను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. త‌మ పార్టీలో త‌న వ‌ర్గానికే అధిక బ‌లం ఉంద‌ని నిరూపించుకున్న అఖిలేష్ వ‌ర్గానికే సైకిల్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. దీంతో ములాయం సింగ్ వ‌ర్గానికి భంగ‌పాటు క‌లిగింది.

ఇక ములాయం సింగ్ యాదవ్ ఇన్ని రోజులు తానే త‌మ పార్టీ జాతీయాధ్య‌క్షుడిన‌ని చెప్పుకున్న విష‌యం తెలిసిందే. 25 ఏళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని స్థాపించి, దాన్ని నెట్టుకుంటూ వ‌స్తోన్న ములాయం సింగ్ యాద‌వ్‌కి ఆఖ‌రున‌ తాను స్థాపించిన పార్టీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. అయితే, ఈసీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా తాము ఆమోదిస్తామ‌ని ములాయం సింగ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు కూడా.

మరోవైపు అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో వ‌చ్చిన కుటుంబ క‌ల‌హాల‌తో ములాయం సింగ్ యాద‌వ్‌, అఖిలేష్ యాద‌వ్ రెండు వ‌ర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వార్ మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. తండ్రి చాటు బిడ్డగా అనే మార్క్ నుంచి బయటకు వచ్చిన అఖిల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటమే తరువాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Akhilesh Yadav  Samajwadi Party  Cycle Symbol  Mulayam Singh Yadav  

Other Articles

Today on Telugu Wishesh