సిద్ధూ చేరాడు.. అయినా కాంగ్రెస్ కి షాకే! | Navjot Singh Sidhu joins shocks to Congress.

After sidhu joins former punjab cm daughter quits congress

Navjot Singh Sidhu, Sidhu Congress, Navjot Singh Sidhu Gurkanwal Kaur, Gurkanwal Kaur Joins BJP, BJP Punjab, Punjab Elections 2017, Congress Punjab Elections, Navjot Singh Sidhu Rahul Gandhi, Beant Singh daughter, Punjab Politics, Sidhu with Budha

Navjot Singh Sidhu joins Congress, meets Rahul Gandhi, ahead of Punjab Assembly election 2017. Former Punjab CM Beant Singh’s daughter quits ‘suffocating’ Congress, joins BJP.

సిద్ధూ ఇలా చేరాడు.. ఆమె అలా వెళ్లిపోయింది

Posted: 01/16/2017 09:14 AM IST
After sidhu joins former punjab cm daughter quits congress

సస్పెన్స్ కు తెరదించుతూ మాజీ క్రికెటర్, బిజెపి మాజీ ఎంపీ, ఆవాజ్ ఎ పంజాబ్ స్థాపకుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నాడు. ఆదివారం ఉదయం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో సిద్ధూ ఆ పార్టీలో చేరారు. ఫిబ్రవరి 4న పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సిద్ధూ చేరిక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి సిద్ధూకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఖాయం చేసింది.

అయితే, తన భార్య కౌర్‌తోసహా మరో ఐదుగురు తన అనుయాయులకు పార్టీ టికెట్లను సిద్ధూ డిమాండ్‌ చేసినట్టు సమాచారం. సిద్ధూ భార్య నవజోత్‌ కౌర్‌ గతేడాది నవంబర్‌లోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గతంలో బీజేపీలో పని చేశారు. రాజీనామా అనంతరం కొత్త పార్టీ, ఎన్నికల్లో పోటీ చేయకపోవటం లాంటి నిర్ణయాలు ప్రకటించినప్పటికీ, చివరకు కాంగ్రెస్ లో చేరిపోవటం విశేషం. ఇక మరోవైపు సిద్ధూని లాగి లాభపడుదామనుకున్న ఆప్ కి పెద్ద షాకే తగిలింది కూడా.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ కుమార్తె, అమరీందర్ కేబినెట్ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకమైన గుర్ కన్వాల్ కౌర్ అకస్మాత్తుగా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించింది. దేశ రాజధానిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అవినాశ్‌ రాయ్‌ ఖన్నా తదితరుల సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంజాబ్ ప్రజల కోసం తన తండ్రి రక్తం ధారపోశారని, అయినా కాంగ్రెస్ పార్టీ కనీస సానుభూతి చూపలేదని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వైఖరి నచ్చకనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపాడు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆయన విధానాలు నచ్చి బీజేపీలో చేరినట్టు తెలిపారు. అయితే సిద్ధూ చేరికను వ్యతిరేకిస్తూనే ఆమె చేరుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సమీకరణాలు మారుతుండటంతో పంజాబ్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  Assembly elections  2017  Navjot Singh Sidhu  Congress  Gurkanwal Kaur  BJP  

Other Articles