పాకిస్థాన్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా..? Army Rubbishes Hafiz Saeed surgical strikes Claim

Army rubbishes hafiz saeed surgical strikes claim

Hafiz Saeed, Pakistan Mujahideen, Akhnoor Attack, Pak Terrorists, Jammu and Kashmir, Hafiz Saeed Video, Hafiz Saeed Caught on Camera, Hafiz Saeed on Tape, surgical strike

The terrorists attacked a General Reserve Engineer Force (GREF) camp just 2 km from the International Border, and killed three labourers.

పాకిస్థాన్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా..?

Posted: 01/13/2017 01:45 PM IST
Army rubbishes hafiz saeed surgical strikes claim

భారత సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. అక్రమ చోరబాట్లకు యత్నించే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై పాకిస్థాన్ అక్రమిత కాశ్మీరులో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ పాల్పడి.. ఉగ్రవాదుల ఫీచం అణిచివేయగా, అందుకు ప్రతికారంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ముగ్గురు కూలీలను చంపి పారిపోయారు. అయితే ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉల్‌ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు, భారత మోస్టు వాంటెడ్ జాబితాలో వున్న హఫీజ్ సయీద్ మాత్రం 30 మంది భారత సైనికులను పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమార్చారని చెప్పుకోవడం హేయకరం.

సరిహద్దులో శాంతి చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. పాకిస్థాన్ మాత్రం తమ ఆర్మీని కాదని, ఉగ్రవాదులతో దేశం సరిహద్దులు దాటించి ముగ్గురు కూలీల ప్రాణాలను పోట్టనపెట్టుకుంది. ఇలా దేశ సరిహద్దు ప్రాంతం వరకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు వచ్చి.. భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చి కాల్పులు జరిపినా.. మరి పాకిస్థాన్ అర్మీ వారిని ఎలా రాణించిందన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇంత జరుగుతున్న పాకిస్థాన్ అర్మీ గోళ్లు గిల్లుకుంటుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కాగా 30 మంది భారత సైనికులను ఉగ్రవాదులు హతమార్చారన్న వార్తల్లో నిజం లేదని భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

హఫీజ్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత సైన్యాధికారులు ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ‘పాక్‌ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో జనరల్‌ రిజర్వ్‌ ఇంజనీర్‌ ఫోర్స్‌(డీఆర్‌ఈఎఫ్‌) క్యాంపుపై సోమవారం ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ 10 మంది సిబ్బంది, మరో 10 మంది కూలీలు ఇంజనీరింగ్‌ పనులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌ఈఎఫ్‌ కూలీలు చనిపోగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. హఫీజ్‌ చెప్పుకున్నట్లు 30 మంది చనిపోవడంగానీ, ఆర్మీ క్యాంపుపై దాడిగానీ జరగలేదు’ అని ఆర్మీ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles