ఆ దేశంలోనూ మన కరెన్సీకి చిల్లర కష్టాలు.. | To Ease Crisis RBI to Give Nepal 1 Billion in Rs 100 Notes.

India to give nepal rs 1 billion over demonetization

Reserve Bank of India, Nepal, demonetization, Rs 100 Notes, RBI Crisis, Nepal Indian Currency, shortage of 100 notes, India demonetization in Nepal, RBI to Nepal

Reserve Bank of India to give Nepal Rs 100 cr in Rs 100 Notes to tide over shortage after demonetization.

వంద నోట్లు, వంద కోట్లు.. ఎగిరిపోతున్నాయ్...

Posted: 01/07/2017 09:30 AM IST
India to give nepal rs 1 billion over demonetization

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు భారత్ లోనే కాదు, ఇండియన్ కరెన్సీని నమ్ముకున్న పొరుగుదేశాల్లో కూడా నెలకొంది. ముఖ్యంగా భారత్ తో ఎక్కువ వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్న నేపాల్ పై కొత్త కరెన్సీ కష్టాల ప్రభావం ఎక్కువగా పడింది. ఆ మధ్య సరైన సవరణ చట్టం తేకుండా తమ దేశంలో కొత్త నోట్లను అనుమతించబోమని నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్బీఐ అందుకు అవసరమైన రూల్ తోపాటు కొత్త నోట్లను నేపాల్ కు పంపేందుకు సిద్ధమైంది.

సుమారు వంద కోట్ల రూపాయ‌ల విలువైన రూ.100 నోట్ల‌ను పంపించేందుకు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ముందుకొచ్చింది. ఇక్క‌డ భార‌త క‌రెన్సీ విరివిగా చ‌లామ‌ణిలో ఉండ‌డంతో నోట్ల ర‌ద్దు ప్ర‌భావం వారిపైనా ప‌డింది. ముఖ్యంగా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు డ‌బ్బులు లేక అల్లాడిపోతున్నారు. వారి అవ‌స్థ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వారికి భారీ మొత్తంలో డ‌బ్బులు పంపాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది.

భార‌త ప్ర‌భుత్వం పెద్ద నోట్లు ర‌ద్దు చేసిన త‌ర్వాత త‌మ దేశంలోని భార‌త క‌రెన్సీని చలామణి చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాలంటూ గ‌త కొంత‌కాలంగా నేపాల్ రాష్ట్ర బ్యాంకు భార‌త్‌ను కోరుతోంది. దీంతో స్పందించిన ఆర్బీఐ తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌వ‌రి మాసాంతానికి రూ.100 కోట్ల విలువైన రూ.100 నోట్ల‌ను పంపించాల‌ని నిర్ణ‌యించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  RBI  Indian Currency  100 notes  demonetization  

Other Articles