నేతాజీ చావలేదు.. చిత్రహింసలు పెట్టి వాళ్లే చంపారు!! | Bose Was Tortured To Death By The British.

Subhas chandra bose died due to british torture

Netaji Subhas Chandra Bose, Bose death mystery, G D Bakshi Bose, British torture Bose died, Bose: The Indian Samurai, Netaji and the INA Military Assessment, Netaji death mystery, Subhas Chandra Bose, Netaji plane crash, Netaji death new twist, Netaji death file, Mystery death of Netaji, Netaji Siberia, Soviet Union Chandra Bose, Netaji Mystery 2017, Netaji killed

Netaji Subhas Chandra Bose Was Tortured To Death By The British, didn't die in the plane crash. Claims Maj Gen G D Bakshi (retd), author of the book "Bose: The Indian Samurai - Netaji and the INA Military Assessment.

నేతాజీ డెత్ మిస్టరీ.. ఇంకో కొత్త ట్విస్ట్

Posted: 01/07/2017 08:46 AM IST
Subhas chandra bose died due to british torture

ఇప్పటికీ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై మిస్టరీ కొనసాగు... తూనే ఉండగా, మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. విమాన ప్రమాదంలో ఆయన చనిపోలేదని, బ్రిటీష్ వాళ్లు హింసించటం మూలంగానే చనిపోయాడంటూ కొత్తగా విడుదలైన ఓ పుసక్తం వాదిస్తోంది.

‘‘ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు. సోవియట్ యూనియన్ కి పారిపోయాడు. ఈ విషయాన్ని జపాన్ ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. అక్కడ బ్రిటీష్ వాళ్లు ఆయన్ని బంధించి ఓ చెరసాలలో పెట్టి హింసించారు. అందుకే ఆయన చనిపోయారు’’ అంటూ ఆ పుసక్తంలో ఉంది. బోస్ - ది ఇండియన్ సామ్రాయ్-నేతాజీ అండ్ ది ఐఎన్ ఏ మిలిటరీ అస్సెస్ మెంట్ ’’ అనే పుస్తకంలో జీడీ బక్షి అనే మాజీ సైనికాధికారి పేర్కొన్నాడు.

జాకోబ్ మాలిక్ అనే అధికారి సాయంతో ముందుగా సైబీరియా చేరుకున్న బోస్ అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ ను నెలకొల్పాడని తెలిపాడు. అసలు ఆగష్టు 18న ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడని చెప్పేందుకు సరైన ఆధారాలే లేవని అంటున్నాడు. సైబీరియా నుంచి రేడియో ప్రసంగాల ఆధారంగా ఆంగ్లేయులు ఆయన్ని పట్టుకుని సోవియట్ అధికారుల మద్ధతుతోనే ఆయన్ని విచారిస్తుండగా, తీవ్రంగా హింసించటంతో చనిపోయాడని ఆ పుస్తకంలో బక్షి తెలిపాడు.

కాగా, నేతాజీ మిస్టరీ మిస్సింగ్ తర్వాత 70 ఏళ్లకు అంటే 2015 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిని విషయం తెలిసిందే. ఆయన మృతిపై వేసిన రెండు కమిటీల్లో ఒకటి విమాన ప్రమాదంలోనే చనిపోయాడని చెప్పగా, ముఖర్జీ కమిషన్ మాత్రం తుది నివేదికలో బోస్ చానాళ్లూ బతికే ఉన్నాడంటూ నివేదిక సమర్పించింది. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Netaji Subhas Chandra Bose  Death Mystery  British Torture  

Other Articles