దీపికా, కోహ్లీ అంటే ఇష్టమన్న సీఈవో.. ఎవరో తెలుసా..? Sundar Pichai unveils Digital Unlocked

Sundar pichai unveils digital unlocked says ready to help india in cashless economy

Google, Sundar Pichai, Digital Unlocked, Demonetisation, Google India, cashless economy, digital ecomy, deepika padukune, virat kohli, iit korazpur

Google India has launched new initiatives including a new training programme Digital Unlocked, says ready to help india in cashless economy if given chance

దీపికా, కోహ్లీ అంటే ఇష్టమన్న సీఈవో.. ఎవరో తెలుసా..?

Posted: 01/05/2017 08:14 PM IST
Sundar pichai unveils digital unlocked says ready to help india in cashless economy

డిజిటల్ ఎకానమీ, క్యాష్ లెస్ సోపైటీ దిశగా అడుగులేస్తున్న భారత కు ఈ విషయంలో ఏ విధంగానైనా తమ సంస్థకు అవకాశమిస్తే అందుకు తాము సిద్దంగా వున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై స్పందిస్తూ అర్థిక అంశాలలో తాను నిఫుణుడిని కాదని, అయినా ఇది సాహసోపేత నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై స్పందించాలని కోరగా.. పెద్ద వేదికలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు విశేషమైన ప్రభావం ఉంటుందని అన్నారు.

ప్రజలకు ఫోన్లు ఉండి.. వాటిలో లోకేషన్‌ గుర్తించే వీలుండటం రైడ్‌-షేరింగ్‌ (క్యాబ్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయని.. దీంతో రవాణా వ్యవస్థలో విశేషమైన మార్పులు వచ్చాయని అన్నారు అదేవిధంగా పెద్దనోట్ల రద్దును తాను తక్కువ అంచనా వేయనన్నారు. భారత్‌లో ఇలాంటి వాటి వల్ల విశేషమైన బహుళ ప్రభావాలు ఉంటాయన్నారు. ఇతర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే భారత్‌ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ల్యాండ్‌ లైన్లకు బదులు సెల్‌ఫోన్లు వాడుతున్నాం. అదేవిధంగా డిజిటల్‌ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి.

ప్రజలు అనుకుంటున్న దానికన్నా మెరుగైన మౌలికవసతులు దేశంలో ఉన్నాయన్నారు. రాత్రుళ్లు మేల్కొని బాగా చదువుతుండటంతో, మరుసటి రోజు క్లాసులకు వెళ్లలేక పోయేవాడినని చెప్పారు. హాస్టల్ ఫుడ్ పప్పా? సాంబారా? అని చూసేవాడినని తెలిపారు. తనకు హిందీ బాగా రాదని అన్నారు. తాను కంప్యూటర్ ను తొలిసారి ఇక్కడే చూశానని చెెప్పారు. తనకు ఇష్టమైన హీరోయిన్ దీపికా పదుకొనే అని, ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh