నెట్టింట్లో సంచలనం రేపుతున్న బెంగుళూరు యువతి పోస్టు Bengaluru woman fought back her molester

Bengaluru woman fought back her molester facebook post goes viral

rape, gangrape, Chaitali Wasnick, Bengaluru mass molestation, Grope, Harass, Women unsafe, Bengaluru shame, crime news,

Facebook user, Chaitali Wasnick, wrote a post about experiencing something similar. Bengaluru girls were pawed, groped and abused by revellers during New Year's Eve celebrations.

నెట్టింట్లో సంచలనం రేపుతున్న బెంగుళూరు యువతి పోస్టు

Posted: 01/05/2017 05:59 PM IST
Bengaluru woman fought back her molester facebook post goes viral

బెంగళూరులోని సిలికాన్ వ్యాలీలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అక్కడికి చేరుకున్న యువతులపై అరాచకశక్తుల మంద తమ అంగబలం, మందబలంతో వారిపై బహిరంగంగా జరిపిన కీచక పర్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్న తరుణంలో.. తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని తాను ఎలా బుద్ది చెప్పిందో వివరిస్తూ తన ఫేస్ బుక్ లో వివరిస్తూ చేసిన పోస్టు కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఒంటరి వెళ్తున్న ఓ యువతి తనను వేధించేందుకు వచ్చిన యువకుడిని ధైర్యంగా ఎదిరించి తగిన బుద్దిచెప్పింది చైతలీ వాస్నిక్. పిడి గుద్దులు కురిపించి. నాలుగు తన్నులు ఇవ్వడంతో అకతాయి పారిపోయాడు

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి విధులు ముగించుకుని చైతలీ ఇంటికి నడుచుకుని వెళ్తోంది. రోడ్డుపై పోలీసులు ఉండటంతో ఆమె భయపడలేదు. కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు ఆమెకు దగ్గరగా వచ్చి, అసభ్యంగా తాకాడు. ఆమె ఒంటరిగా ఉన్నందున భయంతో ఏ మాట్లాడదని ఆకతాయి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే చైతలీ వెంటనే అతణ్ని పట్టుకుని పిడుగుద్దులు కురిపించింది. కాలితో ఎడాపెడా తన్నింది. ఈ దెబ్బకు ఆకతాయి హడలిపోయాడు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి విడిపించేందుకు ప్రయత్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆకతాయి బుకాయించాడు. ఆమె మరింత కోపంతో అతన్ని చితకబాదింది. పోలీసులు వచ్చేలోగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. చైతలీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh