కస్టమర్లకు షాక్.. సర్వీస్ టాక్స్ తప్పనిసరంటున్న ఎన్ఆర్ఏఐ NCW summons KK home minister and mla abu azmi

Ncw summons kk home minister and mla abu azmi

Bengaluru, Mass molestation, New Year celebrations, Women safety, IT capital, NCW, Karnataka HM, g parameshwara, National Commission for Women, Abu Azmi, kiren rijijju

The National Commission for Women (NCW) sent summons to Karnataka Home Minister G Parameshwara and Samajwadi Party leader Abu Azmi for their outrageous remarks over the mass molestation.

ITEMVIDEOS: ఆ ఇద్దరు నేతలకు ఎన్సీడబ్యూ షాక్.. సమన్లు జారీ

Posted: 01/03/2017 04:42 PM IST
Ncw summons kk home minister and mla abu azmi

నూతన సంవత్సర అహ్వానించే నేపథ్యంలో గత నెల 31వ తేదీ అర్థరాత్రి బెంగళూరులో మహిళలపై బహిరంగ లైంగిక వేధింపులకు కొందరు అకతాయిలు పాల్పడిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతలకు జాతీయ మహిళా కమీషన్ సమన్లు జారీ చేసింది. కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, సమాజ్ వాదీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి ఎన్ సీడబ్యూ సమన్లతో షాక్ ఇచ్చింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్‌ లలితా కుమారమంగళం అన్నారు.

బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలలో మహిళలను టార్గెట్ చేసుకుని ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. వికృత చర్యలకు పాల్పడ్డారని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సాంతన చేకూర్చాల్సిన నేతలు దిగజారుడు వ్యాఖ్యలను చేయడం అసమంజసమని ఎన్సీడబ్యూ దుయ్యబట్టింది. యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, దీనికి తోడు పాశ్చాత్య ధోరణిలో సాగడం కూడా ఈ ఘటనలకు కారణమని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర తేలిగ్గా కొట్టిపారేడంపై ఎన్సీడబ్యూ తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని లలిత కుమారమంగళం డిమాండ్‌ చేసింది.

'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు.

దిలా వుండగా, ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజ్జు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక హోమంత్రి జీ పరమేశ్వర అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం అవుతుందని మండిపడ్డారు. నేరస్తులను తప్పకుండా శిక్షించాల్సిందేనని చెప్పారు. వేడుకలకు వచ్చిన మహిళలపై కీచకపర్వానికి పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేందుకు తాము సిద్దంగా లేమన్నారు. బెంగళూరు చాలా వైబ్రంట్‌ సిటీ అని, అక్కడ మహిళలకు రక్షణ కల్పించాలని అయన అన్నారు.

న్యూఇయర్ వేడుకలలో బెంగళూరులో అసలేం జరిగింది..?

సాప్ట్ వేర్ హబ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన బెంగుళూరులోని సిలికాన్ సిటీలో నూతన సంవత్సర వేడుకల్లో మహిళలపై కీచకపర్వం కొనసాగింది. ఆకతాయిలంతా తమ మందబలంతో.. కనిపించిన ప్రతీ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలు మన అడపడచులన్న ఇంగితాన్ని మర్చి.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని తాకరాని చోట తాకూతూ.. లైంగికంగా వేధించారు. తమను రక్షించాల్సిందిగా అక్కడ అగంతకుల చేతిలో చిక్కిన అమ్మాయిలంతా సహాయం కోసం అర్థించారు. గట్టిగా కేకలు వేశారు.. అక్కడున్న పోలీసులు కూడా ఈ పరిణామాలను చూస్తూ.. నిష్చేష్టులగా మారి ప్రేక్షక పాత్ర వహించారే తప్ప.. స్పందించలేదని అరోపణలు కూడా వెల్లువెత్తాయి.

కొంతమంది అమ్మాయిల్ని జుట్టు పట్టుకుని మరీ ఈడ్చుకెళ్లడంతో వారంతా ఏడుస్తూ పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కొంతమంది అమ్మాయిల బట్టలను కూడా చించేయడంతో.. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం వారు రోదించారు. ఒకరిద్దరయితే హెచ్చరించవచ్చు గానీ అక్కడ వేలమంది సమూహం తమపై దాడికి పాల్పడ్డారని..  ఈ నేపథ్యంలో ఏం చేయగలం? అంటూ పత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఓ మహిళ ఏడుస్తూ వెళ్తుంటే.. తనకు రక్తం కారడం చూశానని, ఒళ్లంతా గాయాలయ్యాయని, అదంతా చూశాక తనకు చాలా భయమేసిందని ఆమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles