కిడ్నీ బాధితులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించండీ: పవన్ state government should allocate separate budget says pawan kalyan

State government should allocate separate budget says pawan kalyan

pawan kalyan, jana sena, janasena, janasena pawan kalyan, ichchapuram, uddanam kidney patients, separate budget, kidney patients, janasena srikakulam, pawan kalyan srikakulam

janasena party chief pawan kalyan visits ichchapuram, says state government should allocate separate budget for kidney patients in uddanam

ITEMVIDEOS: కిడ్నీ బాధితులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించండీ: పవన్

Posted: 01/03/2017 11:06 AM IST
State government should allocate separate budget says pawan kalyan

ఉద్దానం పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ సమస్యలను దశాబ్దాలుగా వున్న ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రశ్నించారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్కరాలకు కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి మనుషులు చనిపోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వారిని బతికించే చర్యలకు ప్రభుత్వం ప్రత్యక నిధులను ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.

ఉద్దానం ప్రాంతానికి చెందిన పలవురు డాక్టర్లు, విద్యావేత్తలు కిడ్నీ సమస్యల గురించి పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లినా, కారణాలపై రీసెర్చ్ చేసేందుకు రూ. 20 కోట్లను కూడా కేటాయించలేకపోయారని తెలుసుకున్న ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తానీ విషయాన్ని ఇప్పుడే వింటున్నానని, ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించారు. అనేక విధాలుగా పార్లమెంటుకు వెళ్లి సమస్యను తెలిపినా, ముందడుగు పడలేదని ఆరోపించారు. ప్రజల అరోగ్యాలకు ప్రభుత్వం నిధులను వెచ్చించాలని ఆయన కోరారు.

వందలాది మంది చిన్నారుల అనాధలుగా మారుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే.. రానున్న రోజుల్లో చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి డయాలసిస్ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారని, అసలు ఈ వ్యాధి ఇక్కడి ప్రజలను పట్టి పీడించడానికి గల కారణాలు ఏంటన్న విషయమై.. పరిశోధన జరపాల్సిన అవశ్యకత వుందన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. డయాలసిస్ అన్నది చివరి దశలో తీసుకోవాల్సిన చర్య అన్నారు.

కాగా వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి.. వారికి ఉచితంగా ఔషదాలు ఇచ్చే తొలిదశ చర్యలకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకోవడం లేదని పవన్ అడిగారు. కిడ్నీ వ్యాధి ఎందుకు ఈ ప్రాంతంలో ప్రబలుతుందో తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్రాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధి గురించి, ఆ వ్యాధి బారిన పడిన వారి గురించి తనకు తెలుసునని, స్వయంగా తమ పిన్ని భర్త (బాబాయ్) కూడా ఈ వ్యాధిబారిన పడి మరణించారని పవన్ అవేధనతో అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  ichchapuram  kidney patients  uddanam  separate budget  

Other Articles

Today on Telugu Wishesh