రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చాపురం రాలేదు: పవన్ didn't came to ichchapuram for political gains says pawan kalyan

Didn t came to ichchapuram for political gains says pawan kalyan

pawan kalyan, jana sena, janasena, janasena pawan kalyan, ichchapuram, kidney patients, janasena srikakulam, pawan kalyan srikakulam

janasena party chief pawan kalyan visits ichchapuram, meets kidney patients says didn't came to for political gains

రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చాపురం రాలేదు: పవన్

Posted: 01/03/2017 10:42 AM IST
Didn t came to ichchapuram for political gains says pawan kalyan

సోంపేట, ఉద్దానం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బారిన పడి ఎంతోమంది చనిపోవడం అత్యంత బాధాకరమని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్నారు. అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఈ వ్యాధిభారిన పడి చనిపోవడం అత్యంత పిన్నవయస్సులోనే మరణశయ్యలపైకి చేరుకోవడం కలచివేసిందని పవన్ కల్యాన్ అవేదన వ్యక్తం చేశారు. అనేక మంది చిన్నారులు అనాధలుగా మారుతున్నారని ఈ భాదను మాటల్లో చెప్పనలవికాదని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని మందాడ గ్రామానికి చేరుకుని కిడ్నీ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే ఇచ్చాపురంకు తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు అశించి రాలేదన్నారు. కిడ్నీ సమస్యలపై పరిష్కారం కావాలని తాను కోరుకుని ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. 20 ఏళ్లుగా ఈ సమస్యలతో బాధపడుతున్నరని బాధితులు చెబుతున్నారని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయడానికే వచ్చానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh