న్యూ ఇయర్ విషాదం: పడవలో మంటలు.. 23 మంది దుర్మరణం | At Least 23 Dead in Fire on Indonesian Ferry.

23 dead in indonesia ferry fire

Indonesia, Jakarta Ferry accident, Indonesia ship mishap, Indonesia ferry mishap, Ferry fire, Indonesia fire accident, Jakarta fire accident, Indonesia ferry fire, Jakarta news, Jakarta Ferry mishap, 23 killed ferry fire

Ferry burns near Jakarta, hundreds wounded 23 killed 17 missed.

పడవలో మంటలు.. 23 మంది మృతి

Posted: 01/02/2017 08:21 AM IST
23 dead in indonesia ferry fire

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం 23 మందిని బలితీసుకుంది. ప్రయాణికులను తరలించే క్రమంలో ఓ పడవ(ఫెర్రీ) కి నిప్పు అంటుకోగా, ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోయారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల కోసం మొత్తం 250 మంది ప్రయాణికులతో కూడిన పడవ నార్త్ జకార్త నుంచి బయలుదేరింది.

అయితే ఒక్కసారిగా పడవలో ఒక్క‌సారిగా మంటలు వ్యాపించ‌డంతో 20 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఘ‌ట‌న‌లో మ‌రో 17 మంది గల్లంతు కాగా, 20 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు. టిడుంగ్ ఐల్యాండ్ వద్దకు చేరుకోగానే జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయ‌ని అధికారులు తెలిపారు. త్వరగా మొత్తం వ్యాపించటంతో లైఫ్ జాకెట్ల కోసం జనాలు తోసుకున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

ఈ ప‌డ‌వ‌ ఫైబర్ తో తయారైనది కాబ‌ట్టి నీటిలో మునిగిపోలేదన్నారు. ఈ ప‌డ‌వ‌లో ఎక్కువ మంది విదేశీయాత్రికులే ఉన్నార‌ని అన్నారు. 200 మందిని రక్షించగా, ఆస్పత్రిలో 30 దాకా చికిత్స పొందుతున్నారు. గల్లైంతైన వారి కోసం రక్షణ సిబ్బంది వెతుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesai  North Jakarta  ferry fire  23 killed  

Other Articles

Today on Telugu Wishesh