న్యూఇయర్ గిఫ్ట్: 2500/- కాదు.. అంతకు మించి... | RBI new year gift on Cash withdrawal.

Rbi increases atm withdrawal limit

ATM withdrawal limit, RBI new year giftl, Withdrawal limit extended, 2500 to 4500, ATM withdrawal limit, ATM withdrawal India, Demonetization cash withdrawal, Demonetization 2016, Reserve Bank of India, BHIM app, Old notes ordinance Pranab Mukharjee

From January 1st 2017 ATM withdrawal limit to Rs 4500 from Rs 2500, RBI announced.

ఏటీఎం విత్ డ్రా పరిమితి పెంచేశారు

Posted: 12/31/2016 08:34 AM IST
Rbi increases atm withdrawal limit

మొత్తానికి కొత్త సంవత్సరం కానుకగా ఆర్థిక శాఖ నగదు విత్ డ్రాపై నిబంధనను సడలించింది. జనవరి 1 2017 అంటే రేపటి నుంచి పరిమితిని పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన చేసింది. ఏటీఏం ల ద్వారా చేసే పరిమితిని మరో రూ. 2 వేలు పెంచుతున్నట్టు తెలిపింది. అంటే, ఇప్పటిదాకా రూ. 2,500 వరకూ విత్ డ్రా పరిమితి ఉండగా, రేపటి నుంచి, అంటే జనవరి 1వ తేదీ నుంచి రోజుకూ రూ. 4,500 వరకూ విత్ డ్రా చేసుకోవచ్చన్న మాట.

ఇక బ్యాంకుల నుంచి వారానికి విత్ డ్రా పరిమితి రూ. 24 వేలు సహా మిగతా అన్ని ఆంక్షలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కరెన్సీ కష్టాలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగించేదే. ఇక నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించబోతున్నారన్న వార్తలు గత కొద్దిరోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయంత తెలిసిందే. అయితే దీనిపై అటు ప్రధాని కార్యాలయం నుంచి, ఇటు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేదు. అయితే గురువారం ఢిల్లీలో జరిగిన డిజి ధన్ మేళా లో మాత్రం మోదీ ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్మంతా(నల్లడబ్బు) పేదలకు పంచుతామని ఓ ప్రకటన అయితే చేశారు.

భీం యాప్ ఏంటసలు...

ఇప్పటికే క్యాష్ లెస్ అంటూ ప్రచారం చేస్తున్న కేంద్రం మరో ముందడుగు వేసింది. భీం పేరుతో క్యాష్‌లెస్ లావాదేవీల కోసం స‌రికొత్త యాప్‌ను విడుద‌ల చేసింది. దీనికి ఇంట‌ర్నెట్‌తో ప‌నిలేదు. ప్ర‌స్తుతానికి నెట్ అవసరం అని, భవిష్యత్తులో మాత్రం నెట్ తో ప‌నిలేకుండా యూఎస్ఎస్‌డీ(మెసేజ్‌) ద్వారా ప‌నిచేసే విధంగా డెవలప్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.ఈ యాప్‌లో ఉన్న మ‌రో విశేషం ఏంటంటే, దాదాపు అన్ని బ్యాంకుల‌కు ఇది ఒక్క‌టే స‌రిపోతుంది. అందులో న‌మోదై ఉన్న బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకు అయినా లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చు.ఒక‌సారి గ‌రిష్టంగా రూ.10 వేలు, రోజుకు రూ.20 వేలు ఈ యాప్ ద్వారా పంపించుకునే వెసులుబాటు ఉంది.

ఇన్ స్టాల్ ఎలాగంటే...

మొద‌ట గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి భీం(బీహెచ్ఐఎం) యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత దీనిని ఓపెన్ చేసి మ‌న‌కు న‌చ్చిన భాష‌ను ఎంపిక చేసుకోవాలి. ఫోన్ నంబ‌రు వెరిఫై చేసుకోవాలి. మ‌న‌మిచ్చే ఫోన్ నంబ‌రు బ్యాంకులో న‌మోదు చేసిన‌దై ఉండాలి. నంబ‌రు వెరిఫై అయిన త‌ర్వాత సెల్‌కు మెసేజ్ వ‌స్తుంది. దీనికి చార్జీ ప‌డుతుంది. ఆ త‌ర్వాత సీక్రెట్ పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. త‌ర్వాత మ‌న బ్యాంకును ఎంచుకుని ముందుకెళ్ల‌డ‌మే.

స్కాన్ అండ్ పే... .

ఇందులో స్కాన్ అండ్ పే ఆప్ష‌న్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడు క్యూఆర్ కోడ్ వ‌స్తుంది. దానిని అవ‌త‌లి వ్య‌క్తుల‌కు పంపితే వారు స్కాన్ చేసి డ‌బ్బులు చెల్లించవ‌చ్చు. ఇదే ప‌ద్ధ‌తితో మ‌నం కూడా డ‌బ్బులు చెల్లించ‌వ‌చ్చు. ఈ లావాదేవీల‌న్నీ మ‌నం మొద‌ట న‌మోదు చేసుకున్న బ్యాంకు నుంచే జ‌రుగుతాయి. కాబ‌ట్టి ఇత‌ర వాలెట్ల‌లా ముందుగా అందులోకి డ‌బ్బులు జ‌మ చేసుకోవాల్సిన ప‌నిలేదు. అలాగే భీంలో న‌మోదు కాని, యూపీఐ లేని ఖాతాదారుల‌కు కూడా ఈ యాప్ సాయంతో డ‌బ్బులు పంపించ‌వ‌చ్చు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, అకౌంట్ నంబ‌రు, ఎంఎంఐటీ, మొబైల్ నంబ‌ర్ల‌ను ఉప‌యోగించి లావాదేవీలు జ‌రిపే వీలుంది. ఈ యాప్ నుంచి డ‌బ్బులు పంపించాలంటే తొలుత యూపీఐ పిన్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది.

 

పాతనోట్ల ఆర్డినెన్స్ కు రాజముద్ర...

మార్చి 31 తర్వాత రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను భారీ ఎత్తున కలిగి ఉండటం నేరంగా పరిగణించే అందుకు తగిన జరిమానా, జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు.తాజా ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. కేవలం ఆర్బీఐలోనే వీటిని మార్చుకోవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  ATM withdrawal limit  exceed  2500 to 4500  

Other Articles