బీఎండబ్యూ భారాన్నీ దించేసుకున్న దీపా Dipa Karmakar finally replaces BMW

Dipa karmakar finally replaces the bmw gifted by sachin tendulkar

BMW, Tripura, PV Sindhu, Pullela Gopichand, Sachin Tendulkar, Sakshi Malik, gymnast, Dipa Karmakar, Hyderabad Badminton Association (BAH), V Chamundeswaranath, Bishweshwar Nandi, Dulal Karmakar

India's star gymnast Dipa Karmakar bought a Hyundai Elantra after returning the BMW presented to her by Sachin Tendulkar after her glorious performance at Rio Olympic Games,

బీఎండబ్యూ భారాన్నీ దించేసుకున్న దీపా

Posted: 12/30/2016 03:34 PM IST
Dipa karmakar finally replaces the bmw gifted by sachin tendulkar

భారత దేశంలో అత్యల్ప అదరణ కలిగిన క్రీడగా వున్నా.. అందులో అత్యున్నతంగా రాణించి రియో ఒలంపకి్స్ లో తన తన అద్భుత ప్రతభను కనబర్చిన క్రీడాకారిణి దీపా కర్మాకర్ గుర్తుందా..? భారత్ తరపున రియోలో జిమ్నాస్టిక్స్ విభాగంలో పాల్గొని కొద్దిలో పతకాన్ని మిస్ అయ్యిన ఈ క్రీడాకారిణి.. అందరి మనసులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ప్రతిభకు మెచ్చుకున్న టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ రియెలో పతకాలు గెలిచిన సింధూ, సాక్షీలతో పాటు అమెకు కూడా బహుమతులను ఇచ్చాడు.

కాగా సచిన్ టెండుల్కర్ ఇచ్చిన బహుమాన భారాన్ని ఎట్టకేలకు దీపా కర్మాకర్ దించేసుకుంది. జిమ్నాస్టిక్స్ లో అత్యంత ప్రమాదకరమైన ప్రొడునొవా విభాగంలో విశేషమైన ప్రతిభను కనబర్చిన దీపాకు ప్రోత్సాహకంగా వుంటుందన్న ఉద్దేశ్యంతో అందజేసిన బీఎండబ్ల్యూ కారును అమె ఎట్టకేలకు తిరిగి ఇచ్చేసింది. అయితే ఆమె స్వస్థలం అగర్తలాలో తన ఇంటికి గతుకుల రోడ్లకు ఆ కారు సరిపోదని, దానికి తోడు సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో లేదని బహుమతి అందుకున్న కొన్నాళ్లకే కారు రిటర్న్ తీసుకోవాలని కోరింది.

దీంతో ఆమె స్వస్థలంలోని పొలిటీషియన్స్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవని చెప్పాలనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు. వెంటనే ఆమె ఉంటున్న ప్రాంతానికి రోడ్డు వేయించారు. అయినప్పటికీ దానిని మెయింటైన్ చేసే స్తోమత తనకు లేదని చెబుతూ ఆమె దానిని వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆమెకు వారు 25 లక్షల రూపాయలు అందజేశారని, ఆ డబ్బుతో తమ ప్రాంతానికి సరిపడే కారును ఆమె కొనుక్కుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆ కారుకు తమ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఉందని ఆయన చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BMW  Tripura  Sachin Tendulkar  gymnast  Dipa Karmakar  

Other Articles