రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్ కొనసాగుతుంది.. Jio Justifies Extension of Free Calls, Data Offer to TRAI

Jio justifies extension of free calls data offer to trai

reliance jio, happy new year offer, jio free calls, jio data offer, trai reliance jio, telecom india, happy new year offer, jio happy new year offer

Reliance Jio has told TRAI that its Happy New Year Offer, which provides free voice and data services to customers, does not violate any of the existing norms that requires promotional offers

రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్ కొనసాగుతుంది..

Posted: 12/30/2016 03:31 PM IST
Jio justifies extension of free calls data offer to trai

దేశవ్యాప్తంగా సుమారుగా 20 కోట్ల మంది మొబైల్ వినియోగాదారులను తమ ఖాతాదారులుగా చేసుకోవడంలో సఫలమైన రిలయన్స్ జియో.. ఇక మరికొన్ని కోట్ల మందిని తమ ఖాతాలో వేసుకునే అలోచనలో భాగంగా ప్రకటించిన న్యూఇయర్ అపర్ కొనసాగుతుందని వెల్లడించింది. ఉచిత మంత్రంతో ఇప్పటికీ ఇతర టెలికాం కంపెనీలకు తీవ్ర పోటీనిచ్చిన జియో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)కు వివరణ ఇచ్చిన అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువరించింది.

తాము గతంలో ప్రకటించిన విధంగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ యధాతథంగా మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తాము అందిస్తోన్న 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు ప్రక‌టించింది. అయితే ఈ ప్రకటనను వెలువరించడంతో మిగతా టెలికాం కంపెనీలు ట్రాయ్ కు పిర్యాదు చేశాయి. డిసెంబర్ 31 వరకు అంటూ చెప్పిన ఆఫర్ ను మార్చి 31 వరకు పొడగించడం నిబంధనల ఉల్లంఘనేనని చెప్పాయి. దీనిపై వివరణ ఇవ్వాలని జియోను ట్రాయ్ ను అదేశించింది.

దీనిపై రిల‌య‌న్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ వివరణ ఇస్తూ.. ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను తాము ఉల్లఘించలేదని అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తేల్చిచెప్పింది. తాము మొద‌ట ప్రక‌టించి ‘వెల్‌ క‌మ్ ఆఫ‌ర్’, తమ తాజా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ‌ర్‌ రెండూ వేరు వేరని పేర్కొంది. తమ ఆఫర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమ ప్రమోషనల్ ఆఫర్ కు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ భిన్నమైందని తెలిపింది. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా తాము హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను తీసుకొచ్చామ‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trai  reliance jio  telecom india  happy new year offer  mukesh ambani  

Other Articles