పైకప్పు అసలు ఎలా కూలింది.. జార్ఖండ్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి | seven people killed in Mine collapse.

Mine collapses seven people killed in jharkhand

Jharkhand, coal mine accident, Jharkhand mine accident, coal mine mishap, Mine roof collapsed, Jharkhand News, Mine Accident, Jharkhand coal mine accident

Several trapped as heap of mud caves in Jharkhand coal mine.

జార్ఖండ్ గని ప్రమాదం.. 7 మంది దుర్మరణం

Posted: 12/30/2016 02:47 PM IST
Mine collapses seven people killed in jharkhand

జార్ఖండ్‌లో ఘోర గని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా, కొందరు గని కింద చిక్కుక్కు పోయారు. గోదా జిల్లాలోని ఓపెన్ కాస్ట్ మైన్ లో ఇది జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని బొగ్గు‌గ‌ని 200 అడుగుల లోపల పని జరుగుతుండగా, పైక‌ప్పు ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. సరిగ్గా ఎంట్రెన్స్ వద్ద పైకప్పు కుప్పకూలిపోవటంతో పరిస్థిితి సంక్లిష్టంగా మారింది.  దీంతో గ‌నిలో ప‌నిలో ఉన్న దాదాపు 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది.

గత రాత్రి 8.30 సమయంలోనే ఇది సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. స‌మాచారం అందుకున్న ఎన్‌డీఆర్ ఎఫ్ సిబ్బంది ప‌ట్నా నుంచి ఘ‌ట‌నా స్థ‌లానికి బ‌య‌లుదేరాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.

కాగా, శకలాల కింద 40 మంది చిక్కుకుని ఉంటారని తోటి ఉధ్యోగులు చెబుతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ తన ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand  coal mine accident  7 killed  

Other Articles