పాత నోట్లు నేడే లాస్ట్.. రేపటి నుంచి ఉంటే ఏం చేయాలి? | Old Currency notes expires today.

Last day to deposit old currency

Old Currency Notes, December 30 Demonetization, Demonetization India, Demonetization last Day, Old Notes March 31st, Old note ordinance, banned Rs 500, 1000 notes, RBI last day old notes, Arun Jaietly demonetization lastday

Economy safe, no cash chaos, FM says on last day of demonetization.

నేడే త్వరపడండి.. నోట్ల రద్దు... ఆఖరి తేదీ

Posted: 12/30/2016 09:08 AM IST
Last day to deposit old currency

ఆర్థికంగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన నిర్ణయంకు అర్థశతకం దాటిపోయింది. అంతేనా ప్రభుత్వం రద్దుచేసిన నోట్లను బ్యాంకుల్లో జ‌మ చేసుకునేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన గ‌డువు డిసెంబర్ 30 నేటితో ముగియ‌నుంది. మరోపక్క ఎల్లుండి నుంచి వీటిని పెద్ద మొత్తంలో కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా అన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆర్టినెన్స్ తో గురువారం సాయంత్రం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది ఆర్బీఐ. రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను పదికి మించి కలిగున్న వారికి రూ.10వేల వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.

తొలుత ఆర్డినెన్సులో ఉన్నట్లుగా నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ‘ద స్పెసిఫైడ్‌ బ్యాంక్‌నోట్స్‌ సెస్సేషన్ ఆఫ్‌ లయబిలిటీస్‌ ఆర్డినెన్సు’ పేరిట దానిని రూపొందించింది. ఈ ఆర్డినెన్సు డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి రానుంది.

ఆర్డినెన్స్ లో ఏముంది?

డిసెంబర్ 30 వరకే నోట్ల డిపాజిట్ చేసుకోవాలి. రద్దయిన నోట్లు ఆపై ఆర్బీఐలోనే మార్చుకోవాలి. మార్చి 31 తర్వాత పాతనోట్లను కలిగున్నవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవటంతోపాటు రూ.10వేల జరిమానా లేదా పట్టుకున్న ధనానికి ఐదురెట్ల జరిమానా విధించనున్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక కౌంటర్లలో పాతనోట్లను డిపాజిట్‌ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. రూ.5వేల జరిమానా లేదా డిపాజిట్‌ చేసిన మొత్తానికి ఐదురెట్లు (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు.

అయితే రీసెర్చ్‌ స్కాలర్స్‌ 25 నోట్ల వరకు తమ దగ్గర పెట్టుకునేందుకు ఈ ఆర్డినెన్సు అనుమతిచ్చింది నేడు కూడా ర‌ద్ద‌యిన నోట్ల‌ను బ్యాంకుల్లో జ‌మ‌చేసుకోలేక‌పోయిన వారు త‌గిన ఆధారాలు చూపించి రిజ‌ర్వు బ్యాంకులో వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌రకు మార్పిడి చేసుకోవ‌చ్చు. విదేశాల్లో ఉన్నవారు, మిలటరీలో పనిచేసేవారు సరైన కారణాలను చూపిమాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

కష్టాలు కొనసాగుతున్నాయా?
డిమాండ్ మేర‌కు కొత్త నోట్ల ముద్ర‌ణ లేక‌పోవ‌డంతో మ‌రో రెండు నెల‌ల‌పాటు నోట్ల కష్టాలు కొన‌సాగవ‌చ్చ‌ని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు జైట్లీ ఈ యాభై రోజుల్లో వసూలైన పన్నుల రూపేణా పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్థిక పరిస్థితి సజావుగానే ఉందని, అల్లర్లు ఎక్కడ జరగటం లేదని, ప్రజలు సమన్వయంతోనే ఉన్నారంటూ తెలిపాడు. మరోసారి సమీక్ష జరిపి అవసరం మేర 500 నోట్ల ముద్రణ జరిపి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక నోట్ల రద్దు రోజు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ప్ర‌ధాని మ‌రోసారి రేపు(డిసెంబర్ 31)న ప్రసగించనున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetization  Last Day  Old Currency Notes  December 30  RBI  March 31st  

Other Articles