ఈ అభిమానిని పాకిస్తాన్ ఏం చేస్తుందో..? Pakistani fan wearing jersey with MS Dhoni's name

Pakistani fan wearing jersey with ms dhoni s name

Australia, Australia vs Pakistan, Cricket, Jersey, MS Dhoni, dhoni fan, dhoni pakistan fan, pakistan government, Pakistan, India, Team India, Indian captain, Virat Kohli, cricket

Pakistani fan, who grabbed eyeballs at the Melbourne Cricket Ground during the Boxing Day Test for sporting a Pakistan team jersey with Indian ODI captain MS Dhoni’s name on it, is a welcome change

ఈ అభిమానిని పాకిస్తాన్ ఏం చేస్తుందో..?

Posted: 12/29/2016 07:21 PM IST
Pakistani fan wearing jersey with ms dhoni s name

ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గౌండ్లో వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఓ క్రికెట్ వీరాభిమాని.. తన కొత్త అలోచనతో హల్ చల్ చేశాడు. అలా ఇలా కాదు ఏకంగా అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి కెమెరాలను తనవైపు తిప్పుకునేలా చేశాడు. పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆ దేశానికి చెందిన క్రికెట్ జెర్సీని ధరించాడు. అందులో విచిత్రమేముందని అడుగుతున్నారు కదూ.. అయితే అక్కడే వుంది మ్యాటర్ అంతా. ఏంచేశాడనేగా..

వివరాల్లోకి ఎంటరైతే.. పాకిస్థాన్ అభిమాని తాను ధరించిన పాకిస్థాన్ క్రికెట్ జెర్సీ పైన భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును లిఖించుకున్నాడు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులతో పాటు అటు కామెంటేటర్ల దృష్టిని సైతం ఆకర్షించి ఆశ్చర్యంలో్ పడేశాడు. ఒక పాకిస్తాన్ అభిమాని అయిన అతను మహేంద్ర సింగ్ ధోని పేరు ముద్రించుకుని స్టేడియంలో కలియతిరిగాడు. దాంతో పాటు ధోని అదృష్ట సంఖ్య ఏడును కూడా జెర్సీ వెనుకభాగాన ముద్రించుకుని మరీ కనిపించాడు.

అయితే ఈ అభిమానిపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా..? అన్నదే తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది జనవరిలో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటకు ముగ్దుడైన పాక్ అభిమాని ఒకరు ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించి ఇరకాటంలో పడ్డాడు. అస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ సందర్భంగా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలవడంతో పాటు మ్యాచ్ ను గెలిచిన టీమిండియాకు మద్దతుగా ఉమర్ దరాజ్ తన ఇంటిపై భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం అతడ్ని అరెస్టు చేయించింది.

ఇలా వేరే దేశపు జెండాను తమ దేశంలో ఎగురవేయడం దేశద్రోహం కిందికి వస్తుందని భావించిన పాక్ కోర్టు అతనికి 10 ఏళ్ల జైలుశిక్షను విధించింది. అయితే ఉమర్ క్రీడాభిమానాన్ని పరిగణలోకి తీసుకుని వదిలపెట్టాలని, అతడికి దేశద్రోహం కేసులకు సంబంధం లేదని, అతడి క్రీడాస్పూర్తిని గౌరవించి వదిలేయాలని పౌరహక్కుల సంఘాలు, పాత్రికేయులు గళం వినిపించారు. కాగా, అతడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని పేరును తమ దేశ జెర్సీపై ధరించిన అభిమానిని పాకిస్థాన్ ఉంచ చేస్తుందోనన్న అందోళన క్రీడాభిమానులలో నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Australia vs Pakistan  Cricket  Jersey  MS Dhoni  Pakistan  India  Team India  Indian captain  Virat Kohli  cricket  

Other Articles