పేదల అకలినే భుజించిన రాబంధులు Lands Alienation in “Kokanada annadhana Samajam”

Lands alienation in kokanada annadhana samajam

Lands Alienation, “Kokanada annadhana Samajam”, lakshmaiah naidu, lakshmidhar naidu, kakinada, Vijayawada, andhra pradesh, cm chandrababu, revenue officials

Kokanada annadhana Samajam trustees shocked as the lands which were given by lakshiah naidu for the trust were sold off without the concern of trustees

పేదల అకలినే భుజించిన రాబంధులు.. కోకనాడ ట్రస్టు భూములు అన్యాక్రాంతం

Posted: 12/28/2016 08:21 PM IST
Lands alienation in kokanada annadhana samajam

పదిమందికి మంచి చేసేవారికి మంచే ఎదురవుతుందని పెద్దలంటారు. కానీ 86 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలను అందిస్తున్న ట్రస్టుకు మాత్రం చెడు ఎదురయ్యింది. పేద విద్యార్థులకు అన్నదానం చేస్తూ.. దశాబ్దాలుగా ముందుకు సాగుతన్న ట్రస్టుకు సంబంధించిన భూములను ప్రభుత్వ అధికారుల అండతో అక్రమార్కులు అప్పన్నంగా కాజేశారన్న అరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయులు చేసిన త్యాగాలకు తమ వంతు సాయం అందించాల్సింది పోయి.. ట్రస్టుకు చెందిన భూములను భుజించే పరాన్న జీవులు వున్నాయని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదల అకలిని తీర్చే కల్పతరువు లాంటి ట్రస్టు భూములను రాబంధులు దిగమింగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో.. కోకనాడ అన్నదాన సమాజానికి కోటా లక్ష్మయ్యనాయుడు చేసిన దానం దారి తప్పడమే దీనికి నిదర్శనం.

1930లో ఏర్పాటు ......

పేదలు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చేవారికి నిత్యాన్నదానం చేసే ఉద్దేశంతో 1930లో కోకనాడ అన్నదాన సమాజం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కాకినాడ సమీపంలోని జి.వేమవరం గ్రామానికి చెందిన 600 ఎకరాల భూమిని కోటా లక్ష్మయ్యనాయుడు దానం చేశారు. ఆ కాలంలో ఎంతో గొప్పగా ఆ కార్యక్రమం చేపట్టారు. కొన్నాళ్ల తర్వాత కోటా వారసులంతా అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. దీంతో ఆ బాధ్యతలను ట్రస్ట్‌కు అప్పగించారు. కాలక్రమేణా ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన లక్ష్యం దారితప్పింది. సమాజం కింద ఉన్న భూములను కొంతమంది స్వార్ధపరులు అన్యాక్రాంతం చేశారు. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వచ్చిన కోటా వారసులు కోకనాడ అన్నదాన సమాజాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజం మొక్కుబడిగా నడవడం చూసి చలించిపోయారు.

భూములు అమ్మినట్లు తెలిపిన అధికారులు ....

పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడం చూసి వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూముల వివరాలపై కోటా వారసులు ఆరా తీయగా.. భూములన్నీ అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం కోటి రూపాయల విరాళం మాత్రమే ఉందని.. దానిపై వచ్చే వడ్డీతో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కలత చెందిన కోటా వారసులు.. మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజాన్ని మరింత విస్తృతపరచాలని నిర్ణయించుకున్నారు.

మిగిలిన ఆస్తుల రక్షించాలని నిర్ణయం....

ఇప్పటికే ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు కోటా వారసులు కంకణం కట్టుకున్నారు. అన్యాక్రాంతమైన భూముల లెక్కలపై ఆరా తీస్తామంటున్నారు. మొత్తానికి కొందరు స్వార్ధపరులు సాగిస్తున్న అరాచకాలకు దేవాదాయశాఖ అధికారులు అండగా నిలవడం వల్లే కోకనాడ అన్నదాన సమాజం ఆస్తులు పక్కదారి పట్టాయని స్థానికులంటున్నారు. దీని వెనుక పెద్ద అవినీతి భాగోతం ఉండి ఉంటుందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఉన్నతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమాజం ఆస్తులను రక్షించాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles