పోలవరంకి పైసలిచ్చారు.. పని మాత్రం టైంకి పూర్తవుతుందా? | Polavaram get NABARD first cheque.

Centre released funds for polavaram project

Polavaram Project, NABARD cheque, Rs 1980 crore Polavaram, Pradhan Mantri Krishi Sinchai Yojana Polavaram, Polavaram Central fund, NABARD funds for Polavaram project, Chandrababu Naidu Polavaram project, Uma Bharathi Polavaram, Arun Jaietly Uma Bharathi Venkaiah Naidu Chandrababu Naidu

Centre releases over Rs 1980 crore NABARD funds for Polavaram project.

ITEMVIDEOS:పోలవరంకు నాబార్డ్ తొలివిడత నిధులు

Posted: 12/26/2016 03:43 PM IST
Centre released funds for polavaram project

ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1981.54 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాబార్డ్ ద్వారా విడుదల అవుతున్న ఈ నిధులను చెక్ రూపంలో ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్టీ, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధుల చెక్ అందుకున్నాడు.

నాబార్డ్ మొట్టమొదటి సారి గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని అరుణ్ జైట్లీ అన్నారు. మొత్తం రెండువేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల చెక్కును ప్రధాన మంత్రి క్రిషి సించయ్ యోజన ద్వారా మూడు రాష్ట్రాలకు కలిపి అందజేశారు. జలవనరులను ఎంత వీలైతే అంత వినియోగించుకోవాలని, అప్పుడే రైతులు లాభపడతారని జైట్లీ చెప్పారు. ప్రాజెక్టు త్వరగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరం, నీటిపారుదల పథకాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసారు. ఇక జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా తొలిసారి నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చూపిన చొరవను ఆమె అభినందించారు.

 

చెక్కు అందుకున్న అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ అనుకున్న సమయానికే (2018) ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించాడు. పోలవరం ద్వారా 450 గ్రామాలకు తాగు నీటి సరఫరా జరుగుతుందని, 950 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన చేపటొచ్చని, సుమారు 80 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగుచేయొచ్చని తెలిపాడు. రికార్డు సమయంలోనే పోలవరాన్ని పూర్తి చేసి(మే 2018 నాటికి ప్రధాన పనులు), దేశంలోనే రెండో ప్రాజెక్టుగా పోలవరాన్ని నిలుపుతానని ఆయన ప్రకటించాడు. వాజ్ పేయి సమయంలోనే నదుల అనుసంధానం బీజం పడిందని తెలిపిన బాబు, పోలవరం విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కృతజ్నతలు తెలిపాడు.

1982లోనే పొలవరానికి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తంలో నిధులు అందటం చాలా సంతోషంగా ఉందని మంత్రి వెంకయ్య నాయుడు వివరించాడు. ఏపీ ప్రజల కలగా అభివర్ణించిన వెంకయ్య త్వరగతిన పూర్తి కావాలని అకాంక్ష వ్యక్తం చేశాడు.

అంతకు ముందు బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తున్నామన్నారు. రోజూ 2.5 లక్షలు, 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగిస్తున్నామని అన్నారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణం వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పోలవరం పనులకు నిధులు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో మమేకం కావాలి, ప్రజా సాధికారత సాధించాలని పేర్కొన్నారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం సూత్రాలు విధిగా అమలుచేయాలని ఆదేశించారు. నూతన సంవత్సరం సమస్యల రహితం కావాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Polavaram Project  NABARD Cheque  Chandrababu Naidu  

Other Articles