25 ఏళ్లుగా బాంబును అలా వాడాడు.. చివరికి పేలిందా? | Man Used Grenade To Crack Walnuts For 25 Years.

Man used grenade for 25 years

Chinese Man, Ankan, Nut Cracker Grenade, Actually a Hand Grenade, Chinese Man Grenade 25 years, Nut Cracker China, Crack Walnuts with Grenade, 25 years Grenade in Hand

Chinese Man Discovers That His Trusty Nut Cracker is Actually a Hand Grenade.

పాతికేళ్లుగా బాంబును అలా వాడేశాడంట...

Posted: 12/26/2016 01:35 PM IST
Man used grenade for 25 years

మీకో బహుమతి వచ్చింది.. ఆహా అనుకోండి. అదేంటో మీకు తెలీదు. కొన్నేళ్ల తర్వాత దాని గురించి ఓ బాంబ్ లాంటి వార్త వింటే మీ పరిస్థితి ఏంటి? కాస్త అయోమయంగా ఉంటుంది కదా! కానీ, నిజంగానే బాంబును చేతిలో పట్టుకుని పాతికేళ్లు గడిపిన ఓ వ్యక్తికి ఎలా ఉంటుంది మరీ.

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్. కొన్నాళ్ల క్రితం అంకాంగ్ అనే వ్యక్తికి ఓ అనుకోని బహుమతి వచ్చింది. అదేంటో అర్థం కాకపోయినప్పటికీ షేఫ్ మాత్రం గూటం(వక్కలు దంచే పరికరం) లాగా ఉండటంతో అదే అనుకుని వాడేశాడు. అలా ఇరవై ఐదేళ్లు గడిచిపోయింది. ఈ మధ్య స్థానిక పోలీసులు నిషేద పేలుడు పదార్థాల గురించి కొన్ని ఫోటోలు ప్రచురించి విడుదల చేశారు.

ఆ కరపత్రాలలో ఒకటి అంకాంగ్ కు చేరింది. అందులో సమాచారాన్ని పూర్తిగా చదివిన అంకాంగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్నాళ్లుగా తన వద్ద ఉన్న ‘గూటం’.. గ్రెనేడ్ అని. వెంటనే, దానిని తీసుకువెళ్లి, స్థానిక పోలీసులకు అప్పగించాడు. దానిని పరిశీలించిన పోలీసులు గ్రెనేడ్ గా తేల్చేశారు. ఇంకో భయంకరమైన విషయమేమిటంటే, ఆ గ్రెనేడ్ ఇంకా యాక్టివ్ గానే ఉండటం. వక్కలు దంచేటప్పుడు కనుక మరింత బలంగా దానిని వాడినా, పక్కకు విసిరేసినా ఈపాటికి అది ఎప్పుడో పేలిపోయి ఉండేదని పోలీసులు చెప్పారు. 1991లో అంకాంగ్ కు తన మిత్రుడొకరు ఈ గూటాన్ని బహుమతిగా ఇచ్చాడంట.

China Grenade Man Walnut

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese Man  Grenade  25 years  Nut Cracker  

Other Articles