నగదు రహిత లావాదేవీలకు అధార్ అనుసంధాన యాప్.. Aadhaar payment app set to simplify digital transactions

Aadhaar payment app set to simplify digital transactions

Visa, Unique Identification Authority of India, National Payments Corporation of India, MasterCard, IDFC Bank, aadhaar payment app, AADHAAR, india news, latest news

The government is coming up with an 'Aadhaar Payment App' that could silence digital payments critics. The new app would do away with plastic cards and the point of sale machines once believed to be essential for a less cash society.

నగదు రహిత లావాదేవీలకు అధార్ అనుసంధాన యాప్..

Posted: 12/24/2016 08:27 PM IST
Aadhaar payment app set to simplify digital transactions

నగదుతో ముడిపడి వున్న దేశాన్ని నగదు రహిత లావాదేవీల వైపు పయనింపజేసేందుకు కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు సిద్దం కానుంది. దీంతో ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం లేకుండా.. చెల్లింపులు చేసుకోవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోయినా, స్మార్ట్ ఫోన్ యాప్ లేకపోయినా ఫర్వాలేదు. కేవలం ఆధార్ నెంబర్ తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్.. వుంటే చాలట.

ఈ సరికొత్త యాప్ ను కేంద్ర సర్కారు క్రిస్ మస్ రోజున విడుదల చేయనుంది. దుకాణదారులు ఆధార్ క్యాష్ లెస్ మర్చంట్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రూ.2,000 ఖరీదు చేసే బయోమెట్రిక్ రీడర్ మెషిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది వేలిముద్రలను గుర్తించే పరికరం అన్నమాట. ఈ మెషిన్ ను తన ఫోన్ కు అనుసంధానించుకోవాలి. ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దుకాణదారుడి వద్దనున్న ఆధార్ యాప్ లో కస్టమర్ తన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. బ్యాంకు పేరును సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ రీడర్ పై వేలిని ఉంచితే చాలు లావాదేవీ పూర్తయినట్టే.

వేలిముద్రను స్కాన్ చేసిన తర్వాత అది ఆధార్ డేటాతో పోల్చుకుంటుంది. సరిగ్గానే ఉన్నట్టయితే బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీకి సరిపడా నగదు దుకాణదారుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి పాస్ వర్డ్ లు, పిన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది కూడా లేదని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. సుమారు 40 కోట్ల ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం వయోజనుల్లో సగం సంఖ్యకు ఇది సమానమని, మొత్తం అన్ని ఖాతాలను ఆధార్ నంబర్ తో మార్చి నాటికి అనుసంధానించాలని అనుకుంటున్నామని అజయ్ భూషణ్ తెలిపారు. ఐడీఎఫ్ సీ బ్యాంకు, యూఐడీఏఐ, ఎన్ పీఐ ఈ ఆధార్ యాప్ ను రూపొందించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles