‘ఆ’ ఈ-మెయిల్ అడ్రస్ కు వరదకట్టిన మెయిల్స్ Govt gets 4000 tip-offs on black money in 72 hrs

Government receives 4000 emails on black money in 72 hours

luxury goods, Jewellery, Income Tax, Financial Intelligence Unit, Black Money, finance ministry, Jan Dhan

The government’s email address for black money tipoffs has been flooded with 4,000 messages since Friday, when blackmoneyinfo@incometax. gov.in was made public.

‘ఆ’ ఈ-మెయిల్ అడ్రస్ కు వరదకట్టిన మెయిల్స్

Posted: 12/20/2016 12:50 PM IST
Government receives 4000 emails on black money in 72 hours

గత నెల 8న పెద్ద నోట్ల రద్దు చేసిన తరువాత ఇంకా దేశంలో అనేక మంది నల్లకుభేరులు తమ వద్దనున్న నల్లధనాన్ని కొత్త నోట్లతో భద్రపర్చకున్నారని.. అనడానికి దేశంలో పోలీసులు, అదాయ పన్నుశాఖ అధికారులు దేశవ్యాప్తంగా జరుపుతున్న దాడుల్లో పట్టుబడుతున్న నల్లధనమే రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వేల రూపాయల నోటలో ఎదో వుందని, అందుకనే అధికారులు సరిగ్గా నల్లధనం వున్న చోటే దాడులకు పాల్పడుతున్నారన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

అయితే దీనిపై ఆర్బీఐ, సహా కేంద్ర ఆర్థక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా స్పందించారు. కొత్త రెండు వేల నోటులో చిప్ కానీ, లేదా శాటిలైట్ గుర్తించే రేడియోధార్మిక ఇంక్ కూడా లేదని స్పష్టం చేశారు. తమకు వేగుల ద్వారా అందిన పక్కా సమాచారంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో డబ్బును భద్రపర్చుకున్న నల్లధన కుబేరులు ఇంకా పెద్ద సంఖ్యలో వున్నారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు ప్రజల సహాకారం తీసుకోవాలని కూడా యోచించి నల్లధన కుబేరుల వివరాలు తెలిస్తే తమ ఈ మెయిల్ కు పంపాలని కోరింది.

ఇలా కోరికోరగానే భారత ఆదాయపు పన్ను శాఖకు ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. 'blackmoneyinfo@incometax. gov.in' మెయిల్ కు నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. కేవలం 72 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి. తమ విన్నపానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మెయిల్స్ అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు.

అనుమానం వచ్చిన ఈ మెయిల్స్ ను ముందు వరుసలో పెట్టి వాటిని పరిశీలిస్తున్నామని, వివరాలన్నీ సేకరించిన తరువాత వీరిపై దాడులు జరిపేందుకూ సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐయూ (ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. జన్ ధన్ ఖాతాల్లో చేరిన భారీ మొత్తంలో డబ్బుతో పాటు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు, బ్యాంకు అధికారుల ప్రమేయం తదితరాంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, బంగారం, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు తదితరాలపైనా మెయిల్స్ అందుకున్నామని ఆర్థిక శాఖ అధికారి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : luxury goods  Jewellery  Income Tax  Financial Intelligence Unit  Black Money  

Other Articles