ప్రధాని మోడీకి ఈ చిన్నారి అవేదన.. నెట్ లో వైరల్ toddler criticising PM Modi for demonetisation

Toddler criticising pm modi for demonetisation is winning the internet

demonetisation, narendra modi, toddler, mother, social media, Cutest critique of demonetisation, viral video, funny video, funny critique of demonetisation, demonetisation woos

video of a little kid criticising demonetisation has gone viral on social media. The little one just repeats what the lady holding her says but it’s oh-so-adorable.

ITEMVIDEOS: ప్రధాని ప్రశ్నించి నెట్ జనులకు దెగ్గరైన చిన్నారి.. నెట్ లో వైరల్

Posted: 12/16/2016 01:00 PM IST
Toddler criticising pm modi for demonetisation is winning the internet

నవంబర్ 8.. దేశంలోని అవినీతిపరులకు, అక్రమార్కులకు, నల్లధన కుబేరులకు నిజంగా నయా డర్ కొత్త భయాన్ని పుట్టించిన రోజు. ఆ రోజున పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిగ్గా రాత్రి ఎనమిది గంటలకు సంచలన ప్రకటన చేశారు. అయితే సరిగ్గా అప్పటి నుంచే వారిలో అలుముకున్న భయాందోళన 24 గంటలు గడిచేలోగా అవిరైపోయింది. కానీ అదే ముహూర్తం నుంచి సామాన్యులు, పేదలు, వయోవృద్దులు, మహిళలు ఇలా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడించడం ప్రారంభించింది.

నవంబర్ పదో తేదీ నుంచి దేశంలోని ప్రజలందనూ పనులు మానుకుని మారీ తమ అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రజావసరాలకు డబ్బు ఎంత కావాలో తెలియకో.. లేక అర్థం కాకో లేక అంచానలో పోరబడో మొత్తానికి పెద్దనోట్ల రద్దుకు ఆర్బీఐ కూడా ముందుగా పచ్చజెండా పూపింది. ఆ తరువాత కొత్త నోటును విడుదల చేసినా.. అది కోత్తగా చిల్లర కష్టలను తీసుకువచ్చింది.

ప్రజల వద్ద నున్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని చెప్పిన ప్రభుత్వం.. వాటికి బదులుగా కొత్త నోట్లును కూడా ఇస్తామని పరమితిని పెట్టింది. అయితే కేంద్రం పెట్టిన పరిమితి అధికారికంగా వారానికి 24 వేలు కాగా, అనధికారికంగా జారీ చేసిన అదేశాల మేరకు ప్రస్తుతం నాలుగు నుంచి ఆరు వేల రూపాయలే బ్యాంకులు తమ కస్టమర్లకు ఇస్తున్నాయి. దేశంలోని 2 లక్షల పైచిలుకు ఏటీయం కేంద్రాలలో దాదాపుగా అన్నింటినీ కొత్త నోట్ల ప్రకారం మార్పులు చేశామని చెబుతున్నా.. గత పది రోజులకు పైగా ఏటీయం కేంద్రాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు.

డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు లేనివాళ్ల పరిస్థితి కనాకష్టంగా ఉంది. పరిస్థితలను అథ్యయయనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని, ఈ వాలెట్ అంటూ, మీ మోబైల్ ఫోనే మీ బ్యాంకు అంటూ ఉదార సలహాలు ఇస్తున్నది. త్వరలోనే కష్టాలు తగ్గుతాయని చెప్తున్నది. అయితే అర్థిక నిపుణులు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరాలంటే మరో ఆరు నుంచి ఎనమిది మాసాల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు.

ఈ తరుణంలో మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌లో పోస్టులు, వీడియోలు వెల్లువెత్తుతుండగా, తాజాగా ఓ బుడ్డోడి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. బుజ్జీబుజ్జీ మాటలతో సామాన్యుల పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ మోదీని ఈ బుడ్డోడు కడిగిపారేశాడు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మాటలు అందిస్తుండగా.. వాటిని పొల్లుపోకుండా స్వచ్ఛమైన హావభావాలతో ఈ బుడ్డోడి చెప్పిన తీరు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. మరెందుకు అలస్యం మీరూ ఈ బుడ్డోడి సూపర్‌ వీడియో వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  narendra modi  viral video  toddler  mother  social media  Cutest critique  

Other Articles