వన్నె తగ్గుతున్న బంగారం.. అదే బాటలో వెండి.. Gold and silver are getting smashed

Gold and silver stocks get slammed post fed

gold, silver, gold prices, silver prices, fed reserve, bullion market, Indian market, comex gold futures,Comex silver futures,Fed,US Federal Reserve,Fed rate hike,Kit Juckes,gold price decline,FXTM,gold vs dollar,Commodities,fed action,Fed forward guidance,forward guidance,Gold price falls

Precious metals dragged lower by gold and silver futures, as the US Federal Reserve opted to raise the country's benchmark interest rates by 0.25%.

వన్నె తగ్గుతున్న పసిడి.. అదే బాటలో వెండి..

Posted: 12/16/2016 12:52 PM IST
Gold and silver stocks get slammed post fed

అత్యంత విలువైన లోహలు బంగారం, వెండీలు వాటి కాంతులను కోల్పుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన ప్రభావం పసిడితో పాటు వెండిపై కూడా పడింది. దీంతో పాటు దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడం వంటి పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. డాలర్ కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అటుగా పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేస్తున్న ముదపరులు.. పసిడి నుంచి పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు.

ముంబై బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర 1,410 రూపాయలు తగ్గి 40,200కు రూపాయల దిగువకు చేరిపోయింది. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు ఒక కారణంగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 28,050 రూపాయల నుంచి 27,500 రూపాయలకు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 27,900 రూపాయల నుంచి 27,350 రూపాయలకు చేరింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికొస్తే... ఔన్స్‌ బంగారం ధర పదిన్నర నెలల కనిష్ఠ స్థాయిలో 1,132.15 డాలర్లకు చేరుకుంది. ఏడాదిలో తొలిసారిగా యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచింది. వచ్చే ఏడాది మరింతగా వడ్డీ రేట్లను పెంచవచ్చన్న సంకేతాలను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బులియన్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. బంగారం ధరలు రానున్న కాలంలో మరింతగా తగ్గవచ్చని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold  silver  gold prices  silver prices  fed reserve  bullion market  Indian market  

Other Articles