స్కాంలన్నీ ఆ బ్యాంకులోనే ఎందుకు? | Axis bank now care off Fake account scam.

Axis bank fake account scam busted

Axis Bank Fake account, Axis Bank Scam, Axis Bank loss, Axis Bank accounts, Axis Bank seized, Axis Bank reputation, Axis Bank Rajeev, Axis Bank suspends 50 accounts, Axis bank IT raids, Axis Bank Currency exchange, Axis Bank Demonetization

Axis Bank Fake account Scam suspends 50 accounts, sacks 24 employees after I-T raids.

యాక్సిస్ బ్యాంకు భవితవ్యం ఏమిటో?

Posted: 12/16/2016 09:38 AM IST
Axis bank fake account scam busted

ఓవైపు జనాలు బ్యాంకుల మీద పడుతుండటంతో తమ వద్ద కూడా డబ్బులు లేని బ్యాంకులు వారి ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. మరోవైపు కొందరు కక్కుర్తి అధికారులు కమీషన్ ఆశతో బ్యాంకులోని సొమ్మును మూడో కంటికి కూడా తెలీకుండా నల్ల బాబుల చెంతకు చేర్చేస్తున్నారు. ఈ దశలో ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం యాక్సిస్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన నిఘా నేత్రం ఐటీ శాఖకు విచారణలో పెద్ద పెద్ద స్కాంలే బయటపడుతున్నాయి.

వంద ఖాతాలతో సుమారు కోట్లలో మార్చేసినట్లు వెలుగు చూస్తుండగా, తాజాగా గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లో నిర్వహించిన సోదాల్లో 20 నకిలీ ఖాతాలను గుర్తించారు. వీటిలో దాదాపు రూ.60 కోట్ల మేర డిపాజిట్ అయినట్టు తెలుసుకుని విచారణ చేపట్టారు. ఫేక్ అకౌంట్లను సృష్టించి బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు మార్చేశారు. దీంతో తమ బ్యాంకు పరువు పోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ అనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా భారీ ఎత్తున పెద్దమొత్తంలో జమకావడంతో, ఐటీ అధికారుల దాడుల్లో భారీ ఎత్తున నకిలీ అకౌంట్లు వెలుగు చూడడంతో యాక్సిస్ బ్యాంకు ప్రతిష్ఠ మసకబారిందని అన్నారు. ఈ పరిణామం తమను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని ఆయన బాధపడ్డారు. ఒకసారి బ్రాండ్ నేమ్ పాడైపోతే మళ్లీ దానిని సాధించడానికి తీవ్రమైన కృషి చేయాలని, అలా మాత్రమే మళ్లీ వినియోగదారుల నమ్మకాన్ని పొందగలమని ఆయన చెప్పారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్ అవుతున్న ఖాతాలపై దృష్టిసారించిన అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. జన్‌ధన్ ఖాతాల నుంచి అన్నింటిపైనా నిఘా పెట్టిన ఐటీ అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై కన్నేశారు. ఫలితంగా కోట్లాది రూపాయల నల్లధనం బయటపడుతోంది.

కాగా గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లోని పలు యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లోని నకిలీ అకౌంట్లలో భారీ ఎత్తున జమ అయిన డబ్బును ఐటీ శాఖ అధికారులు వెలికితీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుకానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. కాగా, తమ లైసెన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని యాక్సిస్ బ్యాంక్ తో పాటు, ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. అంతేకాదు స్కాంకు బాధ్యులుగా పేర్కొంటూ 24 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన బ్యాంకు అధికారులు, మరో 50 అకౌంట్లను గుర్తించి రద్దు చేసేశారు. అయినా కనికరించని ఖాతాదారులు భద్రతా లోపమని చెబుతూ తమ అకౌంట్లను మూసివేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Axis Bank  Demonetization  Fake Account Scam  

Other Articles