అమ్మ లాగే సేమ్ ఆ పెద్దాయన కూడా... | Karunanidhi suffers like Jayalalitha.

Karunanidhi third time hospitalized

DMK Chief Karunanidhi, Karunanidhi Hospitalized, Karunanidhi Health, Karunanidhi breath problems, breath Cauvery hospital, DMK chief death news, Karunanidhi Fake death news, Karunanidhi Jayalalitha same, Karunanidhi death rumours

DMK Chief Karunanidhi readmitted to Chennai Cauvery hospital for difficulty in breathing.

అమ్మ.. ఆ పెద్దాయన సేమ్ టూ సేమ్?

Posted: 12/16/2016 09:12 AM IST
Karunanidhi third time hospitalized

శ్వాసకోశ ఇబ్బందులతో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆస్పత్రిలో చేరాడు. గురువారం అర్థరాత్రి పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారని వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న  92 ఏళ్ల కరుణానిధి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు.

మొదటిసారి తీవ్ర అస్వస్థతో చేరిన ఆయన, రెండోసారి అలర్జీ సంబంధిత సమస్యలతో కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన్ను డిశ్చార్జి చేయగా, ఈసారి ఊపిరి పీల్చుకోవటం ఇబ్బంది కావటంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే రీతిలో శ్వాసకోశ ఇబ్బందులతోనే ఆస్పత్రిలో చేరి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Karunanidhi Health

చనిపోయారంటూ పుకార్లు..
అయితే ఆయన మరణించారంటూ మీడియాలో వందతులు వ్యాపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గొంతు, శ్వాసకోస సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karunanidhi Health  Chennai Cauvery Hospital  

Other Articles