బాబా రాందేవ్ పతాంజలి అయుర్వేద ఉత్పత్తులపై ఫైన్ Patanjali fined Rs 11 lakh for misleading ads

Haridwar court fines ramdev s patanjali for misleading consumers

patanjali, Ayurvedic products, haridwar court, baba ramdev, fine, advertisements, Patanjali Ayurved, Patanjali Ayuveda, misleading ads, Patanjali, Patanjali misleading ad, india news

A Haridwar court has slapped five production units of Yoga Guru Baba Ramdev’s Patanjali with a fine of Rs 11 lakh for putting up misleading advertisements”

తప్పుడు ప్రకటనల ఫలితం.. పతాంజలికి ఫైన్.. ప్రమాణాలు గాలికి..

Posted: 12/15/2016 01:02 PM IST
Haridwar court fines ramdev s patanjali for misleading consumers

ఆయుర్వేదంతో ఫాస్ట్ మూవింగ్ కన్యూమర్ గూడ్స్ విభాగంలో దేశంలోనే నాలుగో స్థానంలో వెలుగొందుతున్న యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతాంజలి అయుర్వేద ఉత్పాదనలకు చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పాదనలతో ప్రాచుర్యంలోకి వచ్చిన పతాంజలి సంస్థ.. చక్కని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామని చెబుతూనే.. తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించినందుకు గానే అక్షరాల పదకొండు లక్షల రూపాయలను అపరాధ రుసుంగా చెల్లించనుంది.

దేశంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న బహుళజాతీ సంస్థలను అనతికాలంలో తోసిరాజుతూ ఎదిగిన సంస్థ.. అసత్య ప్రచారాలు చేస్తూ ఎదిగిందన్న అభియోగాల నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన  పతంజలి ఆయుర్వేద  సంస్థకు జరిమానా విధించారు. కాగా, 2012 ఆగస్టులో నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణాల పరీక్షల్లో పతంజలి సంస్థ వస్తువులు నాణ్యతా ప్రమాణాలను పాటించడంలోనూ విఫలమయ్యాయి. దీంతో, పతాంజలి సంస్థకు 11 లక్షల రూపాయల అపరాద రుసుం చెల్లించాల్సిందిగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ న్యాయస్థానం సంస్థ అధికారులను అదేశించింది.

వివరాల్లోకి వెళ్తే..  పతాంజలి సంస్థ తప్పుడు ప్రకటనలు గుప్పించడం, మరోవైపు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంపై న్యాయస్థానంలో మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షల జరిమానా చెల్లించాలని హరిద్వార్ లోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు పతంజలిని ఆదేశించింది. ఇతర సంస్థల ఉత్పాదనలను తమ బ్రాండ్ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టిస్తోందని, ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో సెక్షన్లు 52, 53 కింద జరిమానా విధించారు. నెలరోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : patanjali  Ayurvedic products  haridwar court  baba ramdev  fine  advertisements  

Other Articles