రైడింగ్ కోసం వెళితే కుక్కలను వదిలింది.. ఆపై.. | Over Rs 2cr seized from B'lore home guarded by dogs

2 25 crores in new notes seized from bengaluru flat guarded by elderly woman s 2 dogs

shock to IT sleuths, bengaluru it sleuths, it officials, Old Woman, Dogs, Bengaluru cash seizure, Cash ban, currency ban, Income Tax department, demonetisation,

Nearly three crores in new notes were found in a Bengaluru apartment where tax officials faced an elderly woman and her two dogs.

ఆదాయపన్ను శాఖ అధికారులపైకి కుక్కల్ని ఉసిగోల్పితే..

Posted: 12/15/2016 10:16 AM IST
2 25 crores in new notes seized from bengaluru flat guarded by elderly woman s 2 dogs

పెద్దనోట్ల రద్దు తరువాత అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వచేసుకుని(అందులోనూ ప్రభుత్వం ముద్రించిన కొత్త రెండు వేల రూపాయల నోట్ల రూపంలో దాచుకున్న) ధనాన్ని స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో.. అక్రమార్కులు గజగజ వణుకుతున్న మాట వాస్తవం. మునుప్పెన్నడూ లేని విధంగా అక్రమార్కుల ఆటలను ఐటీ అధికారులు కట్టడి చేస్తున్నారు. ఈ తరుణంలో అక్కడ భారీగా నల్లడబ్బు వుందని తమకు అందిన సమాచారంతో ఓ అపార్టుమెంటులోకి వెళ్లిన అధికారులకు చుక్కలు చూపించింది ఓ వృద్దురాలు. దీంతో చేసేది లేక తమ కాళ్లకు బుద్ది చెప్పుకున్నారు అదాయశాఖ అధికారులు. అదెట్టా..? అంటారా..

ఉత్తర బెంగళూరు ప్రాంతంలోని యశ్వంత్‌ పూర్‌ ఏరియాలో గల ఓ అపార్టుమెంట్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ఆదాయం పన్ను (ఐటి) అధికారులకు సమాచారం అందింది. ఐటీ అధికారుల బృందం అపార్టుమెంట్ కు చేరుకుని తనిఖీలు చేపట్టేందుకు వెళ్లగా ఓ వృద్దురాలు వారిని నిలువరించింది. తమ ఇంట్లోకి రావటానికి మీకేం పని మా ఇంట్లో అంటూ అధికారులపైకి ఇంటి యజమాని ఇంట్లో పెంచుకుంటున్న రెండు కుక్కలను వదిలింది. దీంతో షాక్‌ కు గురైన అధికారులు పరుగులు తీశారు.

దీంతో కంగారుపడిన అధికారులు చేసేది లేక వెనుదిరిగి స్థానిక పోలీసుల సాయం తీసుకుని ఎట్టకేలకు లోపలకు ప్రవేశించి తనిఖీలే చేపట్టగా వారు మళ్లీ షాక్ కు గురయ్యారు. తమకు వచ్చిన సమాచారం కరెక్టేనని భావించారు. ఇంటి మొత్తం ఎక్కడా డబ్బులు లేకపోవడంతో వెనుదిరుగుతున్న అధికారులకు తాళం వేసి ఉన్న గది కనిపించింది. దాంతో తాళం పగులగొట్టి తనిఖీలు చేసిన అధికారులు అందులో 2కోట్ల 89 లక్షల నగదు దాచి వుంచడాన్ని కనిపెట్టారు. మొత్తం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారికి వచ్చిన లెక్కల్లో చూపని రూ.2.89 కోట్ల నగదును పట్టుకున్నారు. వీటిలో 2.25 కోట్ల రూపాయలు విలువచేసే కొత్త 2 వేల నోట్లు కూడా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles