బట్టలు ఊడిపోతున్నా... విమానం నుంచి ఆమెను ఈడ్చుకెళ్లారు.. | Woman dragged off Delta flight.

Woman dragged off flight by officials

Michigan flight Woman, Woman dragged off, Woman drag video, Woman check at flight gate, Woman Flight officials, Flight woman, Security reasons

Woman dragged off Delta flight by police after reportedly failing to check in at gate.

ITEMVIDEOS:రూల్స్ పాటించలేదని ఆమెను దారుణంగా...

Posted: 12/14/2016 03:26 PM IST
Woman dragged off flight by officials

అది మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టు. ఓ మహిళ ఆదుర్దగా వచ్చి తన లగేజ్ ను సర్దుకుని కూర్చుంది. అంతలో సెక్యూరిటీ అధికారులు గుంపుగా వచ్చారు. ఆ మహిళను అమాంతం సీట్లోంచి లాగి కింద పడేశారు.

ఆమె బట్టలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. జుట్టు చెదిరిపోతోంది. తనను అలా చేయకండంటూ వదిలిపెట్టమని వేడుకుంది. అయినా కనికరించని అధికారులు బర బరా లాక్కుంటూ వెళ్లిపోయారు. అలాగని ఆమె ఏ తీవ్రవాదో, లేక స్మగ్లరో అనుకుంటే పొరపాటే.. ఇంతకీ ఆమెను ఎందుకలా లాక్కెల్లారో తెలుసుకోవాలని ఉందా?

ఏం లేదండీ... ఎయిర్‌పోర్టు వ‌ద్ద నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించినందుకు గానూ సదరు మహిళను అలా లాక్కెల్లారు. విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో, టెర్మినల్ గేటు వద్ద బ్యాగేజీ చెకింగ్, బోర్డింగ్ వద్ద అధికారుల మాటలను వినిపించుకోకుండా విమానంలోకి వచ్చిందంట. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్న విమానాశ్ర‌య అధికారులు విచారణ జరిపి ఆపై వదిలేశారు. ఈ ఘ‌ట‌న జ‌రుగుతుండ‌గా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman Drag from Flight  Security escape  

Other Articles