బతికివున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి చంపేశారు Man found alive after night in mortuary refrigerator

Dead man found alive after night in mortuary fridge

Msizi Mkhize, Dead man, alive, mortuary fridge, Kwa-Zulu Natal Health Authority, Dr Rishigen Viranna, Mahatma Gandhi Memorial Hospital, durban, south africa

A local health authority has launched an investigation after paramedics mistakenly pronounced an injured man 'dead' at the scene of a road accident

బతికివున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి చంపిన ఘనులు

Posted: 12/14/2016 11:34 AM IST
Dead man found alive after night in mortuary fridge

కాసుల కక్కుర్తి కోసం కార్పోరేట్ వైద్యులు మృతదేహాలకు చికిత్స చేసే ఘటనలతో పాటు.. డబ్బులు చెల్లించలేని పేద రోగులను అస్పత్రుల నుంచి బయటకు తోసేసిన ప్రభుత్వ అస్పత్రుల సిబ్బంది నిర్థయఘతుకాలను కూడా మనం చూస్తూనే వున్నాం. అయితే అవగాహన లేని వైద్యులు కూడా డాక్టర్లుగా పోజు కోట్టి నిండు నూరేళ్లు బతకాల్సిన వ్యక్తులను అర్థాయస్సుతోనే అనంతవాయువుల్లో ఐక్యం చేసే ఘటనకు మనకు తెలుసు. అయితే ఇది అభివృద్ది చెందుతున్న దేశాలన్నింటీలోనూ ఇదే పరిస్థితి కనబడుతుందా..? అంటే అవుననే సమాధానాలే తెరపైకి వస్తున్నాయి.

ఇందుకు దక్షిణాప్రికాలోని డర్బన్ లో చేటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని సరిగా పరీక్షించకుండా అతడు చనిపోయినట్టు నిర్థారించిన పారామెడికల్ సిబ్బంది అలక్ష్యంతో నిండు నూరేళ్లు బతకాల్సిన యువకుడు అస్పత్రి మార్చురీ లోంచి బయటకు రాగానే మరణించాడు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణను ప్రారంభించారు. కాగా మార్చురీ నుంచి ప్రాణాలతో బయటపడిన యువకుడిని బతికించేందకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. డర్బన్‌ సమీపంలోని క్వామషు ప్రాంతంలో సిజి కిజే అనే వ్యక్తి 28 ఏళ్ల యువకుడు తన బైక్ పై వెళ్తుండగా, అటుగా వచ్చిన కారు అతడ్ని ఢీకొన్నింది. ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని అస్పత్రికి తరలించేందుకు అక్కడికి చేరకున్న పారామెడికల్‌ సిబ్బంది పరిశీలించి కోమాలోకి జారుకున్న వ్యక్తిని కాస్తా చనిపోయినట్లు భావించి నేరుగా మార్చురీకి తరలించారు. ఆ రాత్రితో పాటు మరునాడు కూడా సిజి కిజే మార్చురీ ఫ్రీజర్‌లోనే ఉన్నాడు. అనంతరం తన కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన సిజి కిజే తండ్రికి పార్థీవదేహాన్ని అందించే క్రమంలో అక్కడి సిబ్బంది అయన ఇంకా శ్వాసతీసుకుంటున్నట్లు గమనించాడు.

దీంతో తన కొడుకు బతికే ఉన్నాడని తనను బతికించుకునేందుకు వెంటనే అక్కడి మహాత్మా గాంధీ మెమొరియల్ హాస్పిటల్‌కు సిజి కిజేను తరలించారు. కాగా, సిజికిజేను బతికించడానికి.. అస్పత్రి వైద్యులు సుమారు 5 గంటల పాటు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రోడ్డు ప్రమాద గాయాలకు తోడు రెండు రోజులుగా మార్చురీ ఫ్రీజర్‌లో ఉన్న ఫలితంగా అతడు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. తన కొడుకు విషయంలో జరిగిన పొరపాటును తాను మాటల్లో చెప్పలేనని సిజి కిజే తండ్రి పీటర్‌ కిజే వెల్లడించారు. కాగా ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Msizi Mkhize  Dead man  alive  mortuary fridge  MGM Hospital  durban  south africa  

Other Articles