ఆ బంధం అతన్ని అనుబంధాలకు దూరం చేసింది Gujarat man's Pakistani wife not allowed to enter Kutch

Gujarat man s pakistani wife not allowed to enter kutch

gujarat, kutch, pakistani wife, Gujarat Man, Sidra, Bhuj, altaf paleja, paleja kutch, Morbi

Altaf Paleja has a home in Bhuj, in Gujarat's Kutch district, but when his Pakistani wife Sidra visited him, they were compelled to stay at a hotel in Morbi.

ఆ బంధం అతన్ని అనుబంధాలకు దూరం చేసింది

Posted: 12/13/2016 12:37 PM IST
Gujarat man s pakistani wife not allowed to enter kutch

పెద్లలకు లేని అంక్షలు పేదలకు మాత్రం వర్తిస్తాయనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం.. ఇప్పటికే అనేక మంది భారతీయులు పాకిస్తాన్ యువతులను వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.. అయితే ఆలాంటి పనినే ఓ పేదవాడి చేస్తే మాత్రం అతడ్ని అంక్షలు చుట్టుముట్టాయి. తనకు నచ్చిన పాకిస్థానీ యువతితో తాను బంధాన్ని పెనవేసుకోగానే.. అప్పటి వరకు అతని చుట్టూరా వున్న అనుబంధాలు దూరం కావాల్సి వచ్చాయి.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌కు చెందిన అల్తాఫ్‌ పలేజా.. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సిద్రాను పెళ్లి చేసుకున్నాడు. కాగా సిద్రా పాకిస్తాన్‌ జాతీయురాలు అయినందున  సరిహద్దు జిల్లా అయిన కచ్‌లోకి ఆమె, కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అల్తాఫ్‌ తన భార్య, ఆరు నెలల కొడుకుతో పాటు అత్తమామల కోసం ఊరికి దూరంగా మోర్బీలో ఉంటున్నాడు.

అయితే అక్కడ కూడా అతనికి అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో అతని తాత్కాలికంగా ఓ హోటల్ లో బస ఏర్పాటు చేసుకున్నాడు. హోటల్ లో బస చేయడం తనకు ఇబ్బందిగా మారిందిని.. అల్తాఫ్ తన అవేదనను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ నుండి తమ అత్తవారికి వీసాలు లభ్యమయ్యాయని.. అయితే కచ్ జిల్లా మినహా ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి ఇస్తూ.. అందులోనూ మళ్లీ మెలిక పెట్టారని బాధితులు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  kutch  pakistani wife  Gujarat Man  Sidra  Bhuj  altaf paleja  paleja kutch  Morbi  

Other Articles