రూ. 10 ఏం చేస్తావు అంటే.. దోంగలను పట్టిస్తాను అంది Youths buy car in Rs 10 notes after robbing bank

Youths buy car in rs 10 notes after robbing bank

car robbery,nasir rakesh afzal,meerut saharanpur,malakpur hussain,UP Saharanpur dist,State Bank Of India,SBI,Saharanpur,demonetisation,currency ban, crime news

The four has stolen Rs. 10 lakh in Rs 10 and Rs 20 notes from the bank just hours after its fund had been replenished.

రూ. 10 ఏం చేస్తావు అంటే.. దోంగలను పట్టిస్తాను అంది

Posted: 12/11/2016 11:01 AM IST
Youths buy car in rs 10 notes after robbing bank

పెద్ద నోట్లను రద్దు నేపథ్యంలో వంద రూపాయల నోటు వున్నవాడు రాజుగా పరిగణింపబడుతుంటే.. పది రూపాయలు వున్నవాడు మహారాజులా పరిగణింపబడుతున్న రోజులివి. ఎందుకంటే పెద్ద విలువైన నోటు రూపాయల రెండు వేల నోటు వున్నా.. దానికి చిల్లర మాత్రం లభ్యం కావడం లేదు. వెయ్యి రూపాయల సరుకులు తీసుకున్నా.. మరో వెయ్యి చిల్లరనివ్వడానికి వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వంద రూపాయల నోట్లు వున్నవాడే సంపన్నుడిగా మారిపోయాడు. ఈ విషయాన్ని పక్కనబెట్టి అసలు విషయానికి వస్తే.. ఇన్నాళ్లు పది రూపాయలు ఏం చేయగలుగుతుంది.. అని అనుకునేవాళ్లు కాస్తా.. ఈ ఘటన గురించి తెలిపి విస్మయానికి గురవుతున్నారు. ఎందుకంటారూ..

పది రూపాయల కరెన్సీ నోట్లు దోంగలను అడ్డంగా బుక్ చేశాయి. ఎలా అంటే  ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లాలోని బెహత్ మండలం కూడా ఒకటి. ఇదే సమయంలో బెహత్ మండలంలోని హుస్సేన్ గ్రామంలో వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుల బృందం మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ అనుమానాస్పదంగా తిరగసాగింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్తూ వస్తున్న వీరు సొంతగా ఓ కారు కొన్నారు. అది మొత్తం రూ.10నోట్లతో చెల్లింపులు జరిపారు. ఈ వార్త కాస్తా అనోటా ఈ నోటా పోలీసుల చెవిన పడింది.
 
దీంతో పోలీసులు నసీర్, రాకేష్, అఫ్జల్, టిటూలపై నిఘా పెట్టారు. గత నెల 19వ తేదీన స్ధానిక భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ)ను ఈ యువకుల బృందం దోచుకున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. విచారణలో బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువజేసే రూ.10, రూ.20నోట్లు దొంగిలించినట్లు యువకుల బృందం ఒప్పుకుంది. కాగా, దోచుకున్న డబ్బు నుంచి రూ.50వేలు, కారును స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుల బృందం కొనుగోలు చేసిన కారు.. సెకండ్ హ్యాండ్ అని గ్రామస్ధులు చెప్పినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saharanpur  rs.10 notes  sbi bank  robbers  uttar pradesh  meerut  demonetisation  crime news  

Other Articles