నల్ల శేఖరుడు.. రెండు గదుల నిండా కొత్త నోట్లు... ఎలా వచ్చాయ్? | New Notes in Shekar Reddy Black Money.

Shekar reddy ousted from ttd board

TTD Shekar Reddy, New Notes in Shekar Reddy, Shekar Reddy Black Money, Shekar Reddy jayalalitha, Shekar Reddy Chandrababu, Shekar Reddy IT raids, Shekar Reddy Black Money, Shekar Reddy New Notes

Shekar Reddy small contractor turns crorepathi with political patronage. Resigned for TTD board over black money allegations.

శేఖర్ రెడ్డికి కోట్ల కొత్త నోట్లు ఎలా దొరికాయ్...?

Posted: 12/10/2016 11:01 AM IST
Shekar reddy ousted from ttd board

శేఖర్ రెడ్డి గత రెండు రోజులుగా వార్తల్లో ప్రకంపనలు రేపుతున్న పేరు ఇది. జయలలిత మరణానంతరం ఆయన సన్నిహితుడిగా పేరున్న శేఖర్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ దాడులు నిర్వహించింది. వందల కోట్ల నగదు, వంద కేజీలకు పైగా బంగారం చూసి షాక్ తిన్న ఐటీ అధికారులు అంత భారీ ఎత్తున నల్లధనాన్ని ఈ చెన్నై వ్యాపారి కూడబెట్టడంపై ఆరాలు తీస్తున్నారు. టీడీడీ పాలక మండలిలో తమిళుడికి స్థానం ఇవ్వాలన్న నిబంధనం ఉండటం, జయ సూచన మేరకు ఏపీ సీఎం చంద్రబాబు శేఖర్ రెడ్డికి పదవి కట్టబెట్టడం తెలిసిందే.

అయితే ప్రస్తుతం విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డికి ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విచారణలో భాగంగా, తాను పాత కరెన్సీని కొత్త నోట్లలోకి మార్చినట్టు, ఆపై మిగిలిన పాత కరెన్సీతో బంగారం కొన్నట్టు శేఖర్ రెడ్డి అంగీకరించగా, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది.

గదుల నిండా నోట్ల కట్టలు:
100 కోట్ల నోట్లు, 130 కిలోల బంగారం ఇదేదో సినిమాలో చూపించినట్లు ఖజానా కి సంబంధించింది కాదు. ప్రముఖ కాంట్రాక్టర్ జె శేఖర్‌రెడ్డి ఇంట్లో ప్రత్యేక గదుల్లో ఐటీ అధికారులకు ఇచ్చిన దర్శనం. గృహాలు, నివాసాలు, గెస్ట్‌ హౌస్‌ల్లో ఎడతెరిపి లేకుండా ఐదు రోజులపాటు తనిఖీలు జరిపిన ఐటీ అధికారులు మొత్తం రూ170 కోట్ల నగదును, 130 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఐటీ విభాగంలో విధాన నిర్ణయాలు తీసుకునే విభాగమైన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) శుక్రవారం ప్రకటించింది.

కొత్త నోట్లు ఎలా వచ్చాయ్...
దొరికిన బంగారంలో 70 కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే ఉన్నాయని, చెన్నైలోని ఓ హోట ల్‌ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు. మొత్తం 107 కోట్ల నగదులో ఏకంగా 70 కోట్లు కొత్త 2000 నోట్లే ఉన్నట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు ఎలా వచ్చాయన్నదానిపై ఆరాలు తీస్తున్నారు. 2000 బండిళ్లపై బ్యాంకింగ్‌ స్లిప్‌లు ఏమీలేవని, దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి వాటిని తీసివేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

Chennai Contractor Shekar Reddy

రాజకీయ లింకులు..

చిన్న కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డి ఈ స్థాయికి ఎదగటం అంటే మాములు విషయం కాదు. పైగా అంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారటం, పైగా నెలరోజులుగా ఎవరి దృష్టిలో పడకపోవటంతో ఖచ్చితంగా దీనివెనకాల రాజకీయ హస్తం ఉండి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ‘అమ్మకు’ ప్రసాదం సమర్పించి శేఖర్ ఇంత డబ్బు వెనకేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వైసీీపీ మాత్రం శేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబు బినామీ అంటూ ఆరోపణలకు దిగింది. 

కొనసాగుతున్న సోదాలు...
మరోవైపు బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్‌ రెడ్డి స్నేహితులు, భాగస్వాములైన శ్రీనివా్‌సరెడ్డి, ప్రేమ్‌ రెడ్డి, కిరణ్‌ రెడ్డి నివాసాల్లో గురువారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకూ తనిఖీలు చేపట్టిన ఐటీ శాఖ అధికారులు.. శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ తనిఖీలు చేశారు. టి.నగర్‌లోని సాంబశివ వీధి, బజుల్లా రోడ్డు, విజయరాఘవ రోడ్డు, అన్నా నగర్‌, మొగప్పేర్‌, వేలూరు, సత్తువాచారి, కాట్పాడి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కాట్పాడిలోని ఓ బంగళాలో ఎవరూ లేకపోవడంతో దానికి సీలు వేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో నగదును పట్టుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఇక శేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన మొత్తం 34 బ్యాంకు లాకర్లకు అధికారులు సీల్‌ వేశారు. వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని అధికారు లు చెబుతున్నారు. ఇక, ఐటీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం మొత్తం తనవేనని శేఖర్‌ రెడ్డి అధికారులకు స్పష్టం చేయటంతో ఆయన్ని, కుటుంబ సభ్యులను విచారించటం ఒక్కటే మిగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD Board Member  Shekar Reddy  Black Money  IT raids  

Other Articles