ఫ్రీ వైఫైతో అవి కాదు డౌన్ లోడ్ చేయాల్సింది. ఒకటి రెండు అయితే ఓకే | Nitish Kumar suggest students on Free Wi-fi.

Bihar secretariat officer warned by nitish kumar

Bihar CM Nitish Kumar, Bihar Chief Minister Nitish Kumar, Nitish Kumar Free Wifi, Bihar Free Wifi, Free Wifi download Movies, Secretariat Free Wifi, Free Wifi download movies, Nitish on Free Wifi, Nitish Kumar at Nishchay Yatra

Nitish Kumar at Nishchay Yatra says Use free WiFi to download books, not movies.

ఫ్రీ వైఫైతో సచివాలయ అధికారి కక్కుర్తి

Posted: 12/10/2016 10:12 AM IST
Bihar secretariat officer warned by nitish kumar

ఫ్రీ వైఫై ఇప్పుడు దేశం మొత్తం మీద వినిపిస్తున్న ఒకే ఒక్క మాట. ప్రజల దృష్టిని, ముఖ్యంగా యూత్ ను ఆకర్షించటంతోపాటు, తమ తమ రాష్ట్రాలను ఉచిత వైఫై సదుపాయంతో నింపేసి టెక్నాలజీ పరంగా దేశంలోనే ఆదర్శంగా నిలవాలని, తద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ఆయా ముఖ్యమంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అయితే ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు వాడాల్సిన ఈ ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయాన్ని వేరే వేరే పనులకు వాడేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అధికారులు కూడా ఉన్నారండోయ్. బీహార్‌లోని సచివాలయంలో ప్రవేశపెట్టిన ఉచిత వైఫ్ సౌకర్యాన్ని ఓ అధికారి ఎంత చక్కగా వినియోగించుకున్నాడో తెలిస్తే వార్నీ అనుకోవటం ఖాయం. ఇంతకీ అంతను ఏం డౌన్ లోడ్ చేశాడో తెలుసా?

బాలీవుడ్; హాలీవుడ్ కు చెందిన సుమారు 300 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకున్నాడంట. ఈ విషయమై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో అధికారిని సుతిమెత్తగా హెచ్చరించారు. నిశ్చల యాత్రలో పాల్గొన్న నితీశ్ మాట్లాడుతూ... ‘‘విద్యార్థులు విజ్ఞాన, విద్యాసమాచారం తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌ పుస్తకాల కోసం మాత్రమే యూనివర్సిటీలు, కళాశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని, అంతేకానీ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కాదని’’ ముఖ్యమంత్రి తెలిపారు. ఒకటి రెండు అయితే ఫర్వాలేదు గానీ మరి ఇంతలా వాడుకోవటం మంచిది కాదని ఆ అధికారికి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.

Nitish Kumar Free Wifi

2017 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. యువత డిజిటల్ స్మార్ట్‌గా మారాలన్నదే తన లక్ష్యమన్న నితీశ్.. ఆ అధికారిలా విద్యార్థులు సినిమాలు డౌన్‌లోడ్ చేయరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar Nishchay Yatra  Bihar CM Nitish Kumar  Free Wifi  

Other Articles