అపోలో ఆస్పత్రి బిల్లు.. విష ప్రయోగం అంతా షాకులే... | Apollo Hospital bill for Jayalalitha's treatment.

Shocks continues after jayalalitha jayaram death

Jayalalitha Jayakumar, Jayalalitha Apollo Hospital, Apollo Bill on Jaya's treatment, Apollo Hospital Jayalalitha, Jayalalitha Apollo Bill, Tamil Nadu Jayalalitha Hospital Bill, Jayalalitha treatment bill, Apollo Hospital Jayalalitha

Jayalalitha treatment Apollo hospital shocks Tamil Nadu government. Advocate Krishnamurthy alleges Sasikala poisoned Jayalalitha.

చనిపోయాక కూడా షాకుల మీద షాకులే!

Posted: 12/10/2016 09:16 AM IST
Shocks continues after jayalalitha jayaram death

తీవ్ర అస్వస్థత 70 రోజులకు పైగా చికిత్స, ఆపై గుండెపోటు పరిస్థితి విషమించి అమ్మ తమిళ ప్రజలను అనాథలను చేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం జయ సమాధే వారికి దేవాలయంగా మారింది. బతికున్నన్నాళ్లు పులిలా రాష్ట్ర నాయకత్వాన్ని నడిపిన ఆమె చివరి రోజుల్లో ఎన్నో వివాదాలు, మరెన్నో మలుపులు. తీరా చనిపోయాక కూడా కుళ్లు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది చాలదన్నట్లు ఆమె చికిత్స పొందిన ఆస్పత్రి యాజమాన్యం మరో పెద్ద షాకే ఇచ్చింది.

చెన్నైలోని అపోలో ఆస్పత్రి ఆమెకు చికిత్స చేసింది కదా. అందుకు వారెంత బిల్లు వేశారో తెలుసా? అక్షరాలా 80 కోట్లు.... (ఎనభై కోట్ల రూపాయలు). అంటే రోజుకు కోటి రూపాయలకు పైగానే. సమాచార హక్కు చట్టంతో ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జయలలితను ఆసుపత్రి రెండో అంతస్తులో ఉంచగా, అందులోని మిగతా గదులన్నీ ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గదులన్నింటి అద్దెతో పాటు లైఫ్ సపోర్ట్ యాంత్రాల అద్దెలు, 39 మంది వైద్యలకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, లండన్ నుంచి పలుమార్లు వచ్చి వెళ్లిన డాక్టర్ రిచర్డ్ బిలే, అతని టీమ్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే బిల్లు జాబితా చాంతాడంత ఉంది.

జయలలిత గుండె ఆగిన తరువాత అమర్చిన ఎక్మో అద్దె రోజుకు కోటి రూపాయలుగా అపోలో వేయడం గమనార్హం. ఆసుపత్రి ఖర్చంతటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో రూ.6 కోట్ల మొత్తం చెల్లించింది కూడా.

అమ్మపై విషప్రయోగం...?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ విష ప్రయోగం చేశారంటూ అన్నాడీఎంకే న్యాయవాది సంచలన ఆరోపణ చేశారు. విషం పెట్టడం వల్లే జయ మృతి చెందారంటూ న్యాయవాది ఆర్.కృష్ణమూర్తి పేర్కొన్నట్టు చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జయ మొత్తం ఆస్తులను కాజేసేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించారంటూ ఆ ఆడియోలో కృష్ణమూర్తి ఆరోపించారు. జయ ఆస్తులు అన్యాకాంత్రం కాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక శశికళ వీలైనంత త్వరగా, మర్యాదగా పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోవాలని అందులో హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఆడియో తీవ్ర దుమారం రేపడంతో శశికళ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శుక్రవారం కోయంబత్తూరుకు వచ్చిన కృష్ణమూర్తిని అన్నాడీఎంకేకు చెందిన కొందరు లాయర్లు చుట్టుముట్టి దాడిచేసినంత పనిచేశారు. అన్నాడీఎంకే గురించి మాట్లాడేందుకు నీవెవరంటూ ప్రశ్నించారు. నీ అంతు చూస్తామని బెదిరించారు. కాగా ఇదే ఆడియోలో తాను జయలలిత పేరుతో ఓ పార్టీని స్థాపించనున్నట్టు, దానిని ఆమె మేనకోడలు దీపను అధ్యక్షురాలిగా చేస్తానంటూ కృష్ణమూర్తి ప్రకటించింది తెలిసిందే.

ఆ అవమానం తర్వాతే అసలు టర్న్...
జయ మరణించాక ఆమె జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలు రోజుకోటి చొప్పున బయటికి వస్తున్నాయి. అసెంబ్లీలో జరిగిన అవమానమే కాకుండా ఎంజీఆర్ అంతిమ యాత్ర సమయంలో కూడా జరిగిన ఓ ఘటన ఇప్పుడు బయటికి పొక్కుతుంది. ఎంజీఆర్ మరణ వార్త వినగానే ముందు ఆమె షాక్ కి గురయ్యారంట. ఇంటికి వెళ్లేసరికి అప్పటికే పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారని తెలియటంతో హుటాహుటీన పరుగులు తీశారు. 21 గంటల పాటు కనురెప్పలు సైతం వాల్చకుండా ఆయన పార్థీవదేహం దగ్గరే ఉండిపోయింది.

ఇక ఎంజీఆర్ అంతిమ యాత్ర సమయంలో ఆ వాహనం ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కారో లేదో.. దిగిపోవాలంటూ అరుపులు. ఎమ్మెల్యే కేపీ రామలింగం ఆమె వైపు దూసుకెళ్లి మెరుపు దాడి చేశాడు. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువైతే దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు, అదనంగా అవమానభారంతో అంత్యక్రియల్లో పాల్గొనకుండానే ఆమె వెనక్కి వచ్చేసింది.

అంతే ఆ మరుసటి రోజు అన్నాడీఎంకే కార్యకర్తలంతా ఆమె దగ్గరికి క్యూ కట్టారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీలో లాఠీచార్జి, జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నాటకీయంగా నెగ్గడం, తర్వాత ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను జయ కోరడం.. దాంతో అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన అన్నీ వరుసపెట్టి జరిగాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha Treatment  Apollo Hospital Bill  

Other Articles