ఆ రోజు రహస్యం అంతా బయటికి వచ్చింది | Modi's demonetization day secret revealed.

Backroom team in a bungalow about demonetization day

PM Narendra Modi, currency ban move, demonetization day, Backroom team in Modi bungalow, Hasmukh Adhia demonetization, Currency ban Day, India November 8th 2016, Modi Announcement

How PM Modi kept the currency ban move a secret.

మోదీది మాములు నిర్ణయం కానే కాదా?

Posted: 12/10/2016 08:44 AM IST
Backroom team in a bungalow about demonetization day

ఆ తేదీ పేరు వినగానే ఒక్కసారి ఉలిక్కిపాటు కలుగుతుంది. టార్గెట్ అయిన నల్ల బాబులే కాదు, సామాన్య ప్రజానీకం కూడా నిద్రలేని రాత్రి గడిపింది. అదే నవంబర్ 8 2016. ఒక రోజు ముందు అంటే నవంబర్ 7న పెద్ద నోట్ల రద్దు పై స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన వేళ యావత్ దేశం ఏం జరుగుతుందో అర్థం కానీ గందరగోళంలోకి నెట్టబడింది. అయితే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఒక్కోక్కటిగా బయటపడుతుండటంతో కాస్త ఊరట చెందుతున్నారు.

కానీ, ఆ తేదీని మాత్రం(నవంబరు 8) భారతావని ఇప్పట్లో మరిచిపోదు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర ఇబ్బందులకు కారణం కావటంతో ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు ముందు ఆ రాత్రి ఎటువంటి కసరత్తు జరిగిందన్న ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖ్యకారకుడు ఎవరు?

హస్‌ముఖ్ అదియా... సెప్టెంబర్ 25న రెవెన్యూ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 2003 నుంచి 2006 వరకు అదియా ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అప్పటి నుంచి ఆయన మోదీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. మోదీ, అదియా కీలక విషయాలను గుజరాతీలో మాట్లడుకునేవారట. అదియా నాయకత్వంలోనే ప్రధాని నివాసంలో రెండు గదుల్లో నోట్ల రద్దుపై కసరత్తు మూడోకంటికి తెలియకుండా కసరత్తు జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మోదీకి అత్యంత నమ్మకస్తుడైన ఈ ఉన్నతాధికారి సహా మరో ఐదుగురు సభ్యుల బృందం మోదీ నివాసంలో నోట్ల రద్దుపై పూర్తిస్థాయిలో చర్చించింది. వీరికి సమాచార, ఆర్థిక అంశాల విశ్లేషణలో నిపుణులైన కొందరు సహకరించారు. రెవెన్యూ కార్యదర్శి హస్‌ముక్ అదియా నాయకత్వంలో ప్రధాని నివాసంలో రెండు గదుల్లో నోట్ల రద్దుపై మూడో కంటికి తెలియకుండా పూర్తిస్థాయిలో కసరత్తు జరిగింది. ఆదియా కూడా మోదీ నిర్ణయం తర్వాత మోదీ నిర్ణయాన్ని పొగుడుతూ ో ప్రకటన చేయటం తెలిసిందే.

నోట్ల రద్దు ప్రకటనకు ముందు నిర్వహించిన మంత్రుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ ‘‘నోట్ల రద్దు అంశంపై తాను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశానని, ఇది కనుక విఫలమైతే అందుకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని చెప్పారట. మరోవైపు మోదీ ‘నల్లధనంపై యుద్ధమిది.. ఇదే చివరి క్యూ’ అంటూ ప్రజల అంగీకారం పొందే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే.

పది రోజుల ముందుగానే..

ఇక ఈ నిర్ణయం ఏదో మొక్కుబడిగా తీసుకుందని కాదని పలు విషయాలు నిరూపిస్తున్నాయి. ఏప్రిల్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకులు ‘పెద్దనోట్ల రద్దు’ సాధ్యమేనని తెలిపారు. మేలో రిజర్వ్‌ బ్యాంకూ కొత్త సిరీస్‌ నోట్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. రూ. 2 వేల నోటు డిజైన్ కూడా పూర్తయిందని.. ఆగస్టులో ప్రకటించింది. నోట్ల ముద్రణ కేంద్రాలు పనిచేయటం ప్రారంభించకముందే అక్టోబర్‌ చివర్లో మీడియాలో కొత్తనోట్ల వార్తలొచ్చాయి. దీంతో మోదీ అండ్‌ టీమ్‌ అప్రమత్తమైంది. ‘ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నవంబర్‌ 18న ఈ ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం లీకయ్యే ప్రమాదం ఉండటంతో ముందుగానే ప్రకటించాల్సి వచ్చింది’.

Money Print India

‘తప్పుచేసిన వారెవరూ పారిపోకుండా ఉండాలనుకున్నాం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తే.. చేసిందంతా అర్థరహితమే అని అనుకున్నాం’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న ఓ అధికారి తెలిపారు. ప్రజలకు సమస్యల్లేకుండా.. కొత్త నోట్లతో 2లక్షల ఏటీఎంలను నింపేందుకు అవసరమైన 8 లక్షల కోట్ల రూపాయలను ఏటీఎంలలో నింపి ఆర్థిక వ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావటమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  demonetization day  Hasmukh Adhia  Currency Ban move  

Other Articles