నోట్ల కష్టాలకు నేటితో నెల.. ఏం ఒరిగిందంటే... | demonetization decision completed one month.

Pm modi demonetisation drive one month review

review on demonetization, Narendra Modi's demonetization, One Month demonetization, demonetization review, Chandrababu Naidu demonetization review, demonetization effect in India, demonetization Currency troubles, November 7th Modi announcement

One month completed for PM Narendra Modi's demonetization announcement.

నోట్ల రద్దుతో అసలు జనాలకేం ఒరిగింది?

Posted: 12/08/2016 08:01 AM IST
Pm modi demonetisation drive one month review

ఈ రోజు తేదీ ఎంతో తెలుసు కదా. డిసెంబర్ 8... ఏం ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారా? నవంబర్ 8 నుంచి నేటికి సరిగ్గా నెల రోజులు గడిచిపోయాయి. ఆరోజు సాయంత్రం మోదీ వెలువరించిన ప్రకటన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం నోటి నుంచి నోట్ల రద్దు వెలువడి క్యాలెండర్ లో 30 రోజులు గడిచిపోయాయి. అయినా కష్టాలు మాత్రం వదలడం లేదు. క్యూలు కరగడం లేదు. ఏటీఎంల కోసం తిరిగి కాళ్లు నొప్పులు పుడుతుంటే.. డబ్బుల కోసం ఎదురుచూసీచూసీ కళ్లు కాయలు కాస్తున్నాయి.

బ్యాంకులో డబ్బులున్నా జేబులు ఖాళీ. దేశం కోసం పెద్ద నోట్ల రద్దు కష్టాలను భరిస్తామని మొదట చెప్పుకొచ్చిన ప్రజలు నెల రోజులు గడుస్తున్నా కష్టాలు కడతేరకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఆర్బీఐ లెక్కల ప్రకారం డిసెంబరు 6 వ తేదీ నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్ము రూ.11..85 లక్షలు. ప్రజల వద్ద చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ.14.13 లక్షల కోట్లు. అంటే దాదాపు 80శాతం సొమ్ము బ్యాంకులకు తిరిగి వచ్చినట్టే. అంటే మిగిలింది మాత్రం కాస్త అటూ ఇటుగా 2.3 లక్షల కోట్లు. కాగా మొత్తంగా సుమారు రూ.లక్ష కోట్ల నల్లధనం మాత్రమే కాలగర్భంలో కలిసిపోతుందని అంచనా వేస్తున్నప్పటికీ అది నెరవేరేలా లేదు.

దానికి కారణం నల్లధనం నియంత్రణలో కీలకపాత్ర పోషించాల్సిన బ్యాంకులు, పోస్టాఫీసులే పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తుండటం. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, సీబీఐ తనిఖీలు ప్రారంభించాయి. అనుమానితులను అరెస్టులు కూడా చేస్తున్నాయి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని బుధవారం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు ఇబ్బందులు తాత్కాలికమేనని, మున్ముందు మంచి ఫలితాలు వస్తాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

‘నోట్ల రద్దుతో ఆర్బీఐ బ్యాలెన్స్‌ షీట్లు మారిపోయే స్థాయిలో సంపద వచ్చి పడదు’ అని వ్యాఖ్యానించారు. పైగా.... జీడీపీ వృద్ధిరేటుపై అంచనాను 7.6 నుంచి 7.1 శాతానికి కుదించారు. పెద్దనోట్ల రద్దువల్ల తలెత్తిన ఇబ్బందులు తాత్కాలికమేనని, మున్ముందు మంచి ఫలితాలుంటాయని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పునరుద్ఘాటించారు. ‘‘బ్యాంకుల వద్ద నిధులు దండిగా ఉంటాయి. రుణ వితరణ పెరుగుతుంది.’ అని అన్నారు. అయితే ఆ. ‘మున్ముందు’ ఎప్పుడన్నది ప్రస్తుతానికి తెలియడంలేదు. వడ్డీరేట్లు తగ్గుతాయని మధ్యతరగతి నుంచి పరిశ్రమ వర్గాల వరకూ అంతా ఆశిస్తుండగా.. ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేయటం కొసమెరుపు.

అంతర్జాతీయ మీడియా ఆకాశానికెత్తుతున్నా సరే ఇందులో పసలేదని పలువురు మేధావులు ఇప్పటికే తేల్చేశారు. అమర్తస్యేన్, అరుణ్ కుమార్ లాంటి సీనియర్ ఆర్థికవేత్తలు నల్లధనం నియంత్రణకు నోట్ల రద్దుకు అసలు సంబంధం ఉండదని ప్రకటించిన నేపథ్యంలో, రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక స్థితి మెరుగు పడటమే కాదు, సామాన్యుడికి ఒరిగే లాభం ఏంటో అర్థం కావటం లేదన్నది పలువురి వాదన. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetization  One Month  PM Modi's announcement  

Other Articles