పెద్దనోట్ల రద్దు నిర్ణయం తొందరపాటు చర్య కాదన్న అర్బీఐ Demonetisation not done in haste, says RBI Governor

Demonetisation not done in haste says rbi governor

urjit patel, rbi, total currency, total currency notes, total new currency notes, repo rate, reverse repo rate, interest rates, inflation

The demonetisation decision was taken after detailed deliberations and not in haste, while nearly Rs 11.85 lakh crore or 80 per cent of junked notes have come back into the system.

పెద్దనోట్ల రద్దు తొందరపాటు నిర్ణయం కాదన్న అర్బీఐ

Posted: 12/07/2016 09:06 PM IST
Demonetisation not done in haste says rbi governor

పాత పెద్ద నోట్ల రద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో 11.55 లక్షల కోట్ల రూపాయల పాత పెద్దనోట్లు చలామణి నుంచి రద్దయ్యాయని, వాటి స్థానంలో కొత్తనోట్లను క్రమంగా ప్రవేశపెడుతున్నామని అన్నారు. నోట్ల రద్దుపై సుదీర్ఘ సమాలోచనలు, లోతుగా పరిశాలించిన తరువాత తీసుకున్నదేనన్నారు. ప్రజల డిమాండ్‌ కు తగ్గ నగదు సరఫరా చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త నోట్లు సరఫరా చేశామన్నారు. ఇప్పటి వరకు 19.1 బిలియన్ల కొత్త కరెన్నీ నోట్లను అర్బీఐ ప్రజలకు అందించిందని, త్వరలోనే మరిన్నీ నోట్లను కూడా చెలామణిలోకి తీసుకోస్తామని చెప్పారు. తగినన్ని కొత్త నోట్లు సరఫరా చేస్తామని, ప్రజలు వీటిని దాచుకోవద్దని సూచించారు. నోట్ల రద్దు తర్వాత అధికారికంగా కొత్త నోట్ల సరఫరాపై ఆర్బీఐ గవర్నర్‌ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు 11.55 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు డిపాజిటయ్యాయని వెల్లడించారు. గత రెండు వారాలు 500, 100 రూపాయల నోట్ల ముద్రణ వేగవంతం చేసినట్టు చెప్పారు. వెయ్యి రూపాయిల నోటును తిరిగి ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నోట్ల కష్టాలు తీరిన తర్వాత నగదు ఉపసంహరణపై పరిమితులు తొలగిస్తామన్నారు. ఆర్బీఐ బ్యాలెన్స్‌ షీటుపై నోట్ల రద్దు ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఆర్బీఐ తర్వాతి సమావేశం ఫిబ్రవరి 7-8 మధ్య ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  cash  government  Urjit Patel  R Gandhi  RBI  Economy and Policy  

Other Articles