ఐదు వేలు దాటితే నో క్యాష్ పేమెంట్స్ | No cash payments over Rs 5000: Jaitley to ministries.

No cash payments over rs 5000

cash payments over Rs 5000, e-payments, e-payments in India, e-payments Jaitley, Jaitley e-Payments, Rs 5000 transactions, e-payments Arun Jaitley,

Payments above Rs 5000 by govt depts to be now made through e-payments: Finance Ministry.

ఈ-పేమెంట్ తో ఎవరికి లాభం?

Posted: 12/05/2016 05:11 PM IST
No cash payments over rs 5000

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఐదు వేల దాటి నగదు చెల్లింపులు చేయాలంటే ఈ-పేమెంట్ సౌకర్యం వాడుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి, ఈ-పేమెంట్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు తెలిపింది.

కాగా, గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ.10 వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ.5 వేలకు కుదించడం గమనార్హం. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఈ-పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించాలని, దేశమంతటా నగదు రహిత చెల్లింపుల విధానం తీసుకురావాలని కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఆమోదంతో తాజా ఉత్తర్వులు జారీఅయ్యాయి.ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు, మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  e-payments  Fiance Ministry  over Rs 5000  cash payments  

Other Articles