వీర విధేయుడే కాబోయే ముఖ్యమంత్రి | Panneerselvam to be Jayalalithaa's successor.

Jayalalithaa loyalist panneerselvam to be her successor

Panneerselvam, Tamil Nadu new CM, Panneerselvam Jayalalitha, Loyalist Panneerselvam, Panneerselvam political carrier, Panneerselvam news, Panneerselvam Amma, Panneerselvam cry, Panneerselvam emotion, Panneerselvam next CM

AIADMK MLAs Pledge Support for Panneerselvam as Amma’s Successor.

పన్నీర్ సెల్వంకే పగ్గాలు? సాయంత్రం కీలక భేటీ!

Posted: 12/05/2016 04:52 PM IST
Jayalalithaa loyalist panneerselvam to be her successor

అమ్మ బతికే అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ అని తేల్చేయటంతో ఇక ఇప్పుడు రాజకీయ వారసుడి ఎంపిక వైపు దృష్టి సారించారు. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలను అపోలో ఆస్పత్రికి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 7 గంటలకు వీరందరూ భేటీ కానున్నారు.

జయలలిత వారసుడిని ఎంపిక చేయడం ద్వారా పార్టీలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా ఉండేందుకు కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్యేల నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా పార్టీ కోరిందని, జయ విధేయుడు, అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పన్నీరు సెల్వంకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేశారు. 135 ఎమ్మెల్యేల మద్ధతు ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల్లోనే మద్ధతుగా సంతకాల సేకరణ కూడా జరిగే అవకాశం ఉంది.

ఈమేరకు సాయంత్రంలోగా అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళనాడులో కీలక మంత్రిత్వ శాఖలన్నింటినీ పన్నీర్ సెల్వంకు ఇటీవలే అప్పగించారు. గతంలో రెండుసార్లు తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వం వ్యవహరించారు. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్లు కూడా జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నట్టు ఉదయం ట్వీట్లు చేశారు. మరోవైపు ఆమె కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు.

అదనపు బలగాల కోసం...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వెంటనే తమరాష్ట్రానికి అదనపు పారామిలటరీ బలగాలను పంపాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీంతో తమిళనాడు పంపేందుకు కేంద్రం 9 కంపెనీల పారామిలటరీ బలగాలను సిద్ధం చేసింది. వీటికి తోడు తమిళనాట లీవులో ఉన్న పోలీసుల సెలవులు రద్దు చేసి విధుల్లో చేరాలని ఆదేశించింది. దీనికి తోడు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఎప్పుడు తెరిచేది ప్రకటిస్తామని తెలిపింది. దీనికితోడు అపోలో ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్ వరకు రోడ్డును బ్లాక్ చేసింది. సాయంత్రం 6 గంటలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. దీంతో తమిళుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బేలె జ‌య‌ల‌లిత ఆరోగ్య‌ ప‌రిస్థితిని ప‌రిశీలించి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌య‌లలిత ఆరోగ్యం చాలా విష‌మంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ప్రస్తుతం మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని చెప్పారు.

గుండె పోటుతో ఒకరి మృతి...
చెన్న‌య్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వ‌చ్చిన వార్త‌లను చూసిన ఆమె అభిమాని, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త నెల‌గంద‌న్‌కు గుండెపోటు వ‌చ్చింది. టీవీల్లో న్యూస్ చూస్తూ గుండెపోటుకు గురై తీవ్ర నొప్పితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు ఆయనను ఆసుప‌త్రికి తీసుకెళ్లేలోపే మ‌ర‌ణించాడు. నెల‌గంద‌న్‌ కడలూరు జిల్లా గాంధీ నగర్‌కు చెందిన వ్య‌క్తి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  New CM Panneerselvam  Jayalalithaa's successor  

Other Articles