ట్రంప్ కన్నా మోదీకే క్రేజ్ ఎక్కువనా? | PM Narendra Modi wins online readers' poll.

Modi wins times person of the year online readers poll

TIME Person Of The Year, Prime Minister Narendra Modi, Modi TIME Person Of The Year, TIME Person Of The Year 2016, TIME Person Of The Year Modi, TIME Person Of The Year winner, TIME Person Of The Year, Narendra Modi ahead of Trump and Putin, Modi Trump Putin, TIME Person Of The Year readers poll, TIME Person Of The Year readers poll result, Modi TIME Person Of The Year

Prime Minister Narendra Modi Wins Online Reader's Poll For TIME Person Of The Year.

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టాప్ లో మోదీ

Posted: 12/05/2016 01:49 PM IST
Modi wins times person of the year online readers poll

రెండున్నరేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న దేశ ప్రధాని మోదీకి తిరుగే లేదని మరోసారి రుజువైంది. ప్రఖ్యాత అమెరికన్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ ‘టైమ్స్‌’ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. వార్తల్లో సంచలనంగా నిలిచిన ట్రంప్, పుతిన్ లను వెనక్కి నెట్టి మరీ ఈ ఘనత సాధించాడు.

అత్యంత ప్రభావ శీలుడైన వ్యక్తి కోసం ఏటా టైమ్స్ ఈ సర్వేను నిర్వహిస్తుంది. కాగా, ఆదివారంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. దీంతో రీడర్స్‌ ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించిన టైమ్స్ రేసులో నిలిచిన వారి పేర్లను వెలువరించింది. నరేంద్రమోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, మార్క్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోందని ప్రస్తుత సర్వే వివరాలను విశ్లేషించిన యాప్‌స్టర్ సంస్థ తెలిపింది.

దీంతో ‘టైమ్స్‌’ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2016’గా ఆయ‌న మ‌రో ఘ‌న‌త సాధించారు. గ‌త ఏడాది మోదీ టైమ్స్‌ రీడర్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచారు. అయితే, ప్రధాన అవార్డు ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ మాత్రం ఆయ‌నకు అప్ప‌ట్లో ద‌క్క‌లేదు. గ‌త ఏడాది ఈ అవార్డు జర్మన్‌ చాన్సలర్‌ ఏంజిలా మోర్కెల్‌కు దక్కింది. ఈ అవార్డును ప్రతి ఏడాదీ ప్రపంచం మొత్తాన్ని అత్య‌ధికంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు ఇస్తారు. ఈ యేడాది ఓపెన్‌టాపిక్, ఐబీఎం సంస్థలతో కలిసి టైమ్ ఎడిటర్లు తుది విజేతను నిర్ణయిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TIME Person Of The Year  2016  readers poll  India PM Narendra Modi  

Other Articles