లేటెస్ట్: జయ కండిషన్ మరింత క్రిటికల్ | Jayalalithaa's condition still in critical.

Apollo hospital bulliten on jayalalithaa health

Tami Nadu, Jayalalithaa health Bulliten, Apollo Hospital latest bulliten, Apollo Hospital Jayalalithaa, Jayalalithaa's Bulliten, Jayalalithaa health bulliten, Jayalalithaa health, Jayalalithaa cardiac arrest, Jayalalithaa death rumour, Apollo Doctors Jayalalitha health

Apollo Hospital latest bulliten on Jayalalithaa's health after Cardiac Arrest says her condition still in Critical.

అపోలో బులిటెన్: ఇంకా డేంజర్ గానే అమ్మ ఆరోగ్యం...

Posted: 12/05/2016 01:13 PM IST
Apollo hospital bulliten on jayalalithaa health

అంతా ఎదురు చూస్తున్నట్లుగానే కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగానే ఉందని అందులో పేర్కొంది. కేవ‌లం ఐదు లైన్ల హెల్త్ బులిటెన్‌ లో పరిస్థితి ఇంకా దిగజారిందని పేర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కు గురైన జ‌య‌ల‌లిత ఆరోగ్యం ఇప్పుడు మ‌రింత దిగ‌జారింద‌ని అందులో పేర్కొన్నారు. ఈసీఎంవో, లైఫ్ స‌పోర్టింగ్ స్టిస్ట‌మ్స్ ద్వారా ఆమెకు చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు అందులో తెలిపారు. సుబ్బ‌య్య విశ్వ‌నాథం అనే అపోలో వైద్యుడి పేరిట ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఆమె ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేమని, మరికొన్ని రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని అందులో వివరించింది.

కాగా,  గతంలో ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బిలే చెన్నైకి చేరుకుని చికిత్స అందించబోతున్నాడు. ఇక తాజా బులిటెన్ విడుద‌ల‌తో ఆసుప‌త్రి వ‌ద్ద ఆమె అభిమానులు మరింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకోపక్క దేశ ప్రధాని మోదీ ఆమె ఆరోగ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాసేపటి క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

వాస్తవం తెలియాల్సిందే.. శశికళా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వర్గాలు వాస్తవాన్ని చెప్పాలని ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ శశికళా పుష్ప డిమాండ్ చేశారు. ఆమె అసలు బతికున్నారా? లేదా? చెప్పాలని కోరిన ఆమె, ప్రజలకు నిజం చెప్పాలని అన్నారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, వీటిని నిలిపి, తమిళనాట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విన్నవించారు. రెండున్నర నెలలుగా ఆసుపత్రిలో ఉన్న ఆమె, పూర్తిగా కోలుకున్నారని ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే గుండెపోటు రావడంపై అనుమానాలు నివృత్తి చేయాలని శశికళ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalithaa  Cardiac arrest  Apollo Health Bulliten  

Other Articles