కొత్త నోటు కొవ్వుతో చేశారా? మతఘర్షణల వదంతులు? | New Rs 2000 note turns out to be non-vegetarian viral.

Animal fat bank note news viral in india

2000 currency note, animal fat in Currency, animal fat in new note, animal fat in 2000 note, Non vegetarian note, India notes fat, England fat note, England non veg note, New Non veg note

New Rs 2000 currency note issued by the RBI is no stranger to rumours. But now it contains animal fat.

కొత్త నోటుతో మత ఘర్షణలు రేగుతాయా?

Posted: 12/02/2016 10:35 AM IST
Animal fat bank note news viral in india

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన 2వేల నోటుపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓసారి చిప్ పెట్టారని, మరోసారి రంగు పోతుందని, అసలు చూడటానికి విచిత్రంగా ఉందని, ఇలా రోజుకో వార్త హల్ చల్ చేస్తుంటే, వాటన్నింటికి వివరణ ఇవ్వలేక ఆర్బీఐ తలపట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ నోటుకు సంబంధించి మరో పుకారు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జంతువుల కోవ్వుతో దీనిని తయారు చేస్తున్నారన్న కలకలం ఒక్కసారిగా ఊపందుకుంది.

ఈ మధ్య యూరప్ లో 5 యూరోల నోటు కొవ్వుతో తయారు చేస్తున్నారన్న వార్త ఒకటి బయటికి వచ్చింది. అంతే దానిని పట్టుకుని మన కొత్త నోట్లు కూడా అదే రీతిలో తయారవుతున్నాయని ఓ గాలి వార్తను లేపుతున్నారు. ఇప్పటిదాకా నోటును నీళ్లలో వేయడం, నిప్పుతో కాల్చడం లాంటి పనులు చేసి కొందరు యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసి సొమ్ము చేసుకున్న కొందరు, ఈ లెటెస్ట్ అప్ డేట్ తో నూనెల్ వేసి కరిగించే ప్రయత్నం చేస్తున్నారు.

అంతే ఈ వీడియో చూసిన వారంతా ప్రభుత్వం హిందువుల మనోభావాలు తీస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా కార్డియాలజిస్టులతో ఆ నోటు గుండె జబ్బులు తెప్పిస్తుందంటూ ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలతో మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని, దయచేసి లేనిపోని వార్తలను సృష్టించకండని పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఇది పట్టని కొందరు మాత్రం వారికి తోచినట్లుగా కొత్త నోటుతో క్రేజ్ సంపాదించేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New 2000 note  Animal Fat  rumour  

Other Articles