లైవ్ చాట్ లో వంద మైళ్ల స్పీడ్.. ఆపై ఏమైంది? | Man using Facebook Live while speeding seriously injured in crash.

Reckless driver crashes on facebook live

Onasi Olio-Rojas, Reckless Driver Video, Facebook Live Driving, Facebook Live chat accident, Facebook Live chat, Facebook Live chat driving

Reckless Driver Videos Himself Speeding On Facebook Live Before Accident.

ITEMVIDEOS:వంద మైళ్ల వేగంతో చెత్త బండిని గుద్దేశాడు...

Posted: 12/02/2016 10:05 AM IST
Reckless driver crashes on facebook live

అతివేగం ఎంత ప్రమాదకరమో ఉదంతలు రోజుకోకటి వెలుగు చూస్తున్నప్పటికీ యువత అతి మాత్రం మానటం లేదు. నలుగురిలో విభిన్నంగా ఉండి ఎదుటి వారిని ఆకట్టుకోవాలన్న ఆత్రుతతో సాహాసాలకు పూనుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని రోడ్ ఐలాండ్ లో బుధవారం ఓ యువకుడు చేసిన నిర్వాకం విషాదంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం, 20 సంవత్సరాల యువకుడు, వేగంగా కారును నడుపుతూ ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఓ చెత్త బండిని ఢీకొని ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఓనాసీ ఓలియో రోజాస్ అనే యువకుడు కారుతో యూఎస్ రూట్ 6పైకి వెళ్లాడు. ఫేస్ బుక్ పేజీలో 100 మైళ్ల వేగాన్ని (సుమారు 160 కి.మీ) అందుకుంటానని ముందే సవాల్ చేసి, తన ప్రయాణాన్ని లైవ్ చూపించడం ప్రారంభించాడు.

 

కారు పూర్తి వేగాన్ని అందుకున్న తరువాత అదుపుతప్పిన కారు రోడ్డు రక్షణగా వేసిన ఓ కాంక్రీట్ అడ్డుగోడను ఢీకొని, ఆపై చెత్త తరలించే వాహనాన్ని డీకొంది. ప్రమాదానికి ముందు కారు మూడు లైన్లను దాటిందని, నిమిషాల్లోనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిందని వివరించారు. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఓలియో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reckless Driver  Facebook Live Chat Driving  accident  

Other Articles